Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మరికాసేపట్లో భారీ వర్షం కురిసే ఛాన్స్..!
హైదరబాద్ వాసులారా బీ అలర్ట్.. వచ్చే రెండు, మూడు గంటలు చాలా జాగ్రత్త ఉండాలి.. ఎందుకంటే హైదరబాద్‌లో మరికాసేపట్లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇప్పటికే నగర వ్యాప్తంగా మబ్బులు కమ్మేశాయి. న్యూములోకుంబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురిసే..
హైదరబాద్ వాసులారా బీ అలర్ట్.. వచ్చే రెండు, మూడు గంటలు చాలా జాగ్రత్త ఉండాలి.. ఎందుకంటే హైదరబాద్‌లో మరికాసేపట్లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇప్పటికే నగర వ్యాప్తంగా మబ్బులు కమ్మేశాయి. న్యూములోకుంబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక శనివారం నాడు భాగ్యనగరాన్ని వరుణుడు ముంచెత్తాడు. పొద్దుపొద్దున్నే భారీ వాన నగరవాసుల్ని పలకరించింది. అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి ఇలా.. నగరంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. దాంతో ఒక్కసారిగా హైదరాబాద్‌లో వాతావరణం మారిపోయింది.
ఇవాళ కూడా శనివారం మాదిరిగానే భారీ వర్షం కురుస్తుందని చెబుతున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. హైదరబాద్‌కు వచ్చే రెండు గంటల్లో భారీ వర్షం అంటూ వర్ష సూచన చేశారు.
జనాల అవస్థలు..
నగరంలో చినుకు పడిందంటే చాలు.. జనాలు చిగురుటాకులా వణికిపోవాల్సి పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల ఇళ్లలోకి నీరు వస్తుంది. దాంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్షంతో ట్రాఫిక్ జామ్ సమస్య కూడా నెలకొంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..