AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana New Secretariat: నేడే తెలంగాణ శ్వేతసౌధం ప్రారంభం.. పూజలు, క్రతువులతో కోలాహలంగా సచివాలయ ప్రాంగణం..

దేశంలో ఎక్కడా లేని సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకొని... ధవళకాతుల ధగధగలతో మెరిసిపోతున్న తెలంగాణ సరికొత్త పాలనా సౌధం కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సకల సదుపాయలతో, ఆధునిక హంగులతో నిర్మితమైన తెలంగాణ కొత్త సచివాలయం నేడు అందుబాటులోకి రానుంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట త‌ర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు త‌మ‌కు కేటాయించిన చాంబ‌ర్లలో ఆశీనులు కానున్నారు.

Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Apr 30, 2023 | 3:16 PM

Share

దేశంలో ఎక్కడా లేని సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకొని… ధవళకాతుల ధగధగలతో మెరిసిపోతున్న తెలంగాణ సరికొత్త పాలనా సౌధం కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సకల సదుపాయలతో, ఆధునిక హంగులతో నిర్మితమైన తెలంగాణ కొత్త సచివాలయం నేడు అందుబాటులోకి రానుంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట త‌ర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు త‌మ‌కు కేటాయించిన చాంబ‌ర్లలో ఆశీనులు కానున్నారు.

భిన్న సంస్కృతులను ప్రతిబింబించే నిర్మాణ శైలుల సమ్మేళనం.. సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల కలబోత. కాకతీయ కళాఖండాలు, తెలంగాణ సంస్కృతి, జీవనస్థితులను అడుగడుగునా నింపుకుని.. దేదీప్యమానంగా ఆవిష్కృతమైందో.. అద్భుత కట్టడం. ఓవైపు హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం, మరోవైపు నిలువెత్తు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, ఇంకోవైపు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నిర్మిస్తున్న అమరజ్యోతి.. పక్కనే ఎన్టీఆర్ పార్క్, లుంబినీ పార్క్, ఆ పక్కన నెక్లెస్ రోడ్, ఐమాక్స్.. ఇలా చారిత్రక, పర్యాటక అంశాలతో ముడిపడిన ప్రదేశంలో నిర్మించిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇవాళ మధ్యాహ్నం సచివాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సుదర్శన యాగం కోసం సచివాలయ ప్రాంగణంలో యాగశాల చేశారు. ఆదివారం ఉదయం నుంచి సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ తరువాత నూతన సమీకృత సచివాలయం రిబ్బన్ కటింగ్ చేసిన వెంటనే 6వ అంతస్తులోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువుదీరనున్నారు. సచివాలాయాన్ని ప్రారంభించిన వెంటనే సీఎం కేసీఆర్ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్‌ తన కుర్చీలో కూర్చున్న తర్వాత… మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లి కుర్చీల్లో కూర్చొంటారు. మంత్రులు అందరూ కూడా తమ శాఖకు సంబంధించిన ఒక దస్త్రంపై… సంతకం చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల వరకు.. అధికారులు కుర్చీల్లో కూర్చొని ఒక దస్త్రంపై సంతకాలు చేయడంతో ప్రారంభోత్సవ ఘట్టం పూర్తవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్ ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ఆహ్వానితులతో కూడిన సమావేశాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చదవండి

చాంబ‌ర్ లో అడుగుపెట్టనున్న కేటీఆర్..

మంత్రి కేటీఆర్ ఇవాళ సచివాలయంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి అడుగుపెట్టబోతున్నారు. నూతన సచివాలయంలో కేటీఆర్‌కు కేటాయించిన మూడో అంతస్తులో నుంచి విధులు నిర్వర్తించనున్నారు. కొత్త సచివాలయంలో విధులను ప్రారంభిస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లకు కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వుల పైలుపై తొలి సంతకం చేయనున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు..

సచివాలయం ప్రారంభోత్సం నేపథ్యంలో సచివాలయం వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ఉదయం నుంచి రాత్రి వరకు.. ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. సచివాలయ ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని… లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్‌ షోలను మూసి వేస్తున్నట్లు హెచ్​ఎండీఏ తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్
వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ!వాడకం మామూలుగా లేదు
వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ!వాడకం మామూలుగా లేదు
దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా?
దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి అంచనా
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి అంచనా
ప్రహరీ గోడ నిర్మాణం.. పిల్లర్లు అవసరమా?
ప్రహరీ గోడ నిర్మాణం.. పిల్లర్లు అవసరమా?
విచిత్ర రూపం..ప్రేమ అపరిమితం.. ప్రపంచ వికృత కుక్క జిన్నీ లూ!
విచిత్ర రూపం..ప్రేమ అపరిమితం.. ప్రపంచ వికృత కుక్క జిన్నీ లూ!