Viral: ఎత్తయిన బిల్డింగ్‌పై వేలాడుతూ చిన్నారి.. సమయానికి దేవుడిలా రక్షించారు.. లేదంటే..

చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. లేదంటే తెలిసీ తెలియని ఆ పసివాళ్లు ఎటు వెళ్తారో, ఏ ప్రమాదంలో చిక్కుకుంటారో ఊహించలేం. తాజాగా ఓ చిన్నారి ఓ పెద్ద భవనంపైన బాల్కనీలో వేలాడుతూ కనిపించాడు. బాలుడ్ని గమనించిన స్థానికులు వెంటనే అలర్టయి రక్షించారు. వారు చేసిన సాహసానికి నెటిజన్లు దేవుడిలా వచ్చారు..

Viral: ఎత్తయిన బిల్డింగ్‌పై వేలాడుతూ చిన్నారి.. సమయానికి దేవుడిలా రక్షించారు.. లేదంటే..
Baby Rescued
Follow us

|

Updated on: Apr 29, 2023 | 2:13 PM

చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. లేదంటే తెలిసీ తెలియని ఆ పసివాళ్లు ఎటు వెళ్తారో, ఏ ప్రమాదంలో చిక్కుకుంటారో ఊహించలేం. తాజాగా ఓ చిన్నారి ఓ పెద్ద భవనంపైన బాల్కనీలో వేలాడుతూ కనిపించాడు. బాలుడ్ని గమనించిన స్థానికులు వెంటనే అలర్టయి రక్షించారు. వారు చేసిన సాహసానికి నెటిజన్లు దేవుడిలా వచ్చారు.. లేదంటే చిన్నారి దక్కేది కాదంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన కజికిస్తాన్‌లో చోటుచేసుకుంది.

ఓ మూడేళ్ల చిన్నారి ఓ పెద్ద భవనంలోని ఎనిమిదో అంతస్తులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిటికీ లోంచి పడిపోయాడు. ఐతే అతడి తల ఆ గ్రిల్‌ మధ్య ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతూ ఉండిపోయాడు. ఆ ఇంటిలోని వారెవరూ ఆ బాలుడ్ని గమనించాలేదు. దాంతో ఆచిన్నారి అలా వేలాడుతూ ఉండిపోయాడు. ఇంతలో కింద అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బాలుడ్ని గమనించారు. షాక్‌ తిన్నవారికి ఏంచేయాలో తోచలేదు. ఏ క్షణంలో పడిపోతాడో అని ఉత్కంఠ నెలకొంది వారిలో. అయితే ఆ చిన్నారిని ఎలాగైనా కాపాడాలనుకున్నారు. కానీ ఆ చిన్నారి తల కిటికీలో ఇరుక్కుపోయింది. కాబట్టి అతన్ని కిందకి లాగితే ఆ చిన్నారికి ప్రమాదం. దాంతో రెండు స్టూల్స్‌ని ఆ చిన్నారి కాళ్ల వద్ద సపోర్ట్‌గా ఉంచారు. వేలాడి వేలాడి ఆ చిన్నారి స్పృహ కోల్పోయాడు. అయినా వారు ఆ భవనంపై స్టూల్స్‌ పట్టుకుని ఆ చిన్నారి స్పృహలోకి వచ్చేంత వరకు అలాగే నిలుచున్నారు. ఇంతలో ఆ చిన్నారి పేరెంట్స్‌ వచ్చి కంగారుపడుతూ, ఆ చిన్నారిని కిటికి గుండా పైకి లాగారు. చిన్నారి స్పృహలోకి వచ్చాడు. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఇద్దర్ని రియల్‌ హీరోలు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..