AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ప్రైవేట్ పార్ట్‌లో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన యువతి.. ఎక్స్‌రే తీయగా డాక్టర్ల మైండ్ బ్లాంక్.!

డాక్టర్లు చాలాసార్లు అరుదైన సర్జరీలు చేయడం సర్వసాధారణం. ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా అలాంటిదే. ఈ ఘటన సోమాలియాలో చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రైవేటు పార్టులో నొప్పిగా ఉందంటూ ఆసుపత్రికొచ్చింది.

Viral: ప్రైవేట్ పార్ట్‌లో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన యువతి.. ఎక్స్‌రే తీయగా డాక్టర్ల మైండ్ బ్లాంక్.!
Viral
Ravi Kiran
|

Updated on: Apr 29, 2023 | 1:33 PM

Share

డాక్టర్లు చాలాసార్లు అరుదైన సర్జరీలు చేయడం సర్వసాధారణం. ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా అలాంటిదే. ఈ ఘటన సోమాలియాలో చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రైవేటు పార్టులో నొప్పిగా ఉందంటూ ఆసుపత్రికొచ్చింది. తీరా డాక్టర్లు ఆమెకు కొన్ని పరీక్షలు చేసి.. ఎక్స్‌రే తీయగా.. అక్కడ కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఆ యువతి ప్రైవేటు పార్టులోకి చొచ్చుకుపోయింది ఓ బులెట్. ఇక దాన్ని అరుదైన ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు డాక్టర్లు. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

వివరాల్లోకి వెళ్తే.. సోమాలియాలోకి చెందిన 24 ఏళ్ల యువతి తన గదిలో కూర్చుని ఉండగా ఓ బులెట్ సీలింగ్ ‌నుంచి వచ్చి సరాసరి తన ప్రైవేటు పార్టులోకి చొచ్చుకుపోయిందట. ఆ ఘటన అనంతరం ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ఎర్డోగన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడున్న డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూడగా సుమారు రెండు సెంటీమీటర్ల బులెట్ ఆమె ప్రైవేట్ పార్టులోకి చొచ్చుకుపోయినట్లు నిర్ధారించారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ కేస్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు.

అందులో పేర్కొన్న ఓ కథనం ప్రకారం.. ‘స్త్రీ జననేంద్రియాల బయటి భాగంలోకి చొచ్చుకుపోయిన మొదటి బులెట్ గాయం ఇదే. ఇవి చాలా అరుదుగా జరుగుతుంది. ఆమెకు అనస్థీషియా ఇచ్చి ప్రైవేట్ పార్ట్‌లో నుంచి బులెట్‌ను బయటకు తీశారు వైద్యులు. బులెట్ తక్కువ వేగంతో మహిళకు తగిలిందని, లేకుంటే ఆమెకు తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉండేదని వైద్యులు అన్నారు. శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆ మహిళ మరుసటి రోజే ఆరోగ్యవంతంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాం. సుమారు నెల పాటు ఆమెను పర్యవేక్షించామని.. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి సమస్యలు రాలేదని’ డాక్టర్లు జర్నల్‌లో పేర్కొన్నారు.

కాగా, యుద్ధం జరుగుతోన్న దేశాల్లో.. ఆకాశంలోకి తూటాలను పేల్చినప్పుడు.. అవి వాటి శక్తిని కోల్పోయి నేలపైకి పడిపోతాయి. ఆ సమయంలోనే ఇలాంటి గాయాలు సంభవిస్తాయి. ఇలాంటి ఘటనలు సాధారణంగా “సోమాలియా లాంటి యుద్ద వాతావరణం నెలకొన్న దేశాల్లోని నివాస ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయి”

చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?