AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: కోట్లకు పడగెత్తిన స్వీపర్.. లాటరీ తగల్లేదండోయ్.. అసలు కత మామూలుగా లేదు..

ఆమె ఒక స్వీపర్. ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫ్లోర్ క్లీనర్‌గా వర్క్ చేస్తుంది. రోజూ హోటల్‌కు రావడం డ్యూటీ చేసుకుని వెళ్లడం కామన్‌గా నడిచింది. అయితే, స్వీపర్‌గా పని చేసే ఆమె.. కోట్లకు పడగెత్తింది. అలాగని ఏ లాటరీనో, మరేదో జాక్ పాట్‌ తగిలిందనుకునేరు. ఎంతమాత్రం కాదు.

Shocking: కోట్లకు పడగెత్తిన స్వీపర్.. లాటరీ తగల్లేదండోయ్.. అసలు కత మామూలుగా లేదు..
Floor Cleaner
Shiva Prajapati
|

Updated on: Apr 28, 2023 | 10:28 PM

Share

ఆమె ఒక స్వీపర్. ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫ్లోర్ క్లీనర్‌గా వర్క్ చేస్తుంది. రోజూ హోటల్‌కు రావడం డ్యూటీ చేసుకుని వెళ్లడం కామన్‌గా నడిచింది. అయితే, స్వీపర్‌గా పని చేసే ఆమె.. కోట్లకు పడగెత్తింది. అలాగని ఏ లాటరీనో, మరేదో జాక్ పాట్‌ తగిలిందనుకునేరు. ఎంతమాత్రం కాదు. మరి కోటీశ్వరురాలు ఎలా అయ్యింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఫైవ్ స్టార్‌ హోటల్స్‌లోకి అనుమతి లేకుండా బయటి వారిని ఎవరినీ లోపలికి అనుమతించరు. భద్రతా కారణాల దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకుంటాయి హోటల్స్ యాజమాన్యాలు. ఎందుకంటే.. ఈ ఫైవ్ స్టార్ హోటల్స్‌కు పెద్ద పెద్ద డెలిగేట్స్ వస్తుంటారు. వారికి సంబంధించిన విలువైన వస్తువులు, వగైరా ఉంటాయి. అందుకే.. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు.

అయితే, ఇంత సెక్యూరిటీ మధ్య కూడా దొంగలు చొరబడ్డారు. అయితే, బయటి నుంచి వచ్చిన దొంగ కాదండోయ్.. హోటల్‌లో ఉండే దొంగనే. అవును, హోటల్‌లో పని చేసే వారే. హోటల్‌లో ఫ్లోర్ క్లీనర్‌గా పని చేసే ఓ మహిళ.. హోటల్‌కు వచ్చే ధనవంతుల జేబులు, వస్తువులను కాజేయడం ప్రారంభించింది. ఇలా నిత్యం జేబు దొంగతనాలకు పాల్పడుతూ.. ఏకంగా కోట్లకు ఎదిగింది. అయితే, చేసే తప్పు ఎప్పుడో ఒకసారి బయట పడక మానదు కదా! ఈమె విషయంలోనూ అదే జరిగింది. ఒకానొక రోజు ఆమె చేసిన దొంగతనం బయటపడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇలా దొంగతనం చేసిన సొమ్ముతో ఆమె కోట్లు కూడగట్టినట్లు తేలింది.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు.. రొమేనియా నివాసి సబ్రినా రోవా అనే 23 ఏళ్ల అమ్మాయి.. హోటల్‌ను సందర్శించే ధనవంతులైన కస్టమర్ల నుండి 365,000 పౌండ్లను దొంగిలించింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 37 కోట్లు. ఇలా చాలా మంది నుంచి విలువైన వస్తువులు కాజేసింది. చివరకు పోలీసులకు చిక్కడంతో అమ్మాయి నిజస్వరూపం బయటపడింది. ఆమె నుంచి 22వేల పౌండ్ల విలువైన ఒక జత కార్టియర్ ఇయర్ రింగ్స్, 17 వేల పౌండ్ల విలువైన రోలెక్స్ ఆయిస్టర్ వాచ్, డియోర్ ముత్యాలతో తయారు చేసిన ఇయర్ రింగ్స్ లభించాయి.

మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలను వెల్లడించింది మహిళ. హోటల్‌కు వచ్చే వారి నుంచి విలువైన వస్తువులను దొంగిలించడమే కాకుండా.. వారి క్రెడిట్ కార్డులను చోరీ చేసి, వాటితో షాపింగ్ చేసేది. అయితే, దొంగిలించిన ఆభరణాలను, డబ్బులను తన ప్రియుడికి ఇచ్చేదని చెప్పుకొచ్చింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..