AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Bike: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒకసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు వస్తుంది.. ఫీచర్స్ కూడా అదుర్స్..

నానాటికి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాలపై ఇంట్రస్ట్ చూపుతున్నారు. దాంతో దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇక కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారుల కోసం విడుదల చేస్తున్నాయి.

Electric Bike: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒకసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు వస్తుంది.. ఫీచర్స్ కూడా అదుర్స్..
Simple One Electric Scooter
Shiva Prajapati
|

Updated on: Apr 27, 2023 | 11:07 AM

Share

నానాటికి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాలపై ఇంట్రస్ట్ చూపుతున్నారు. దాంతో దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇక కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారుల కోసం విడుదల చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్..

సింపుల్ ఎనర్జీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మే 23వ తేదీన బెంగళూరులో లాంచ్ చేయనున్నారు. ఈ స్కూటర్ ముందుగా బెంగళూరు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని, ఆ తరువాత క్రమంగా ఇతర నగరాల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది కంపెనీ.

సింపుల్ వన్ స్కూటర్ అత్యంత వేగవంతమైన స్కూటర్‌గా గుర్తింపు పొందుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. అంతేకాదు.. అత్యంత సరసమైన ధరకే వినియోగదారులకు అందుబాటులో తీసుకురానున్నట్లు తెలిపింది. అలాగే స్కూటర్‌లో ఏర్పాటు చేసిన బ్యాటరీ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, నాణ్యమైన బ్యాటరీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కంపెనీ ప్రతినిధులు.

ఇవి కూడా చదవండి

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవింగ్ రేంజ్..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఇవ్వబడింది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేస్తే.. ఈ స్కూటర్ 236 కిలోమీటర్లు నడుస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా, ఛేంజింగ్ బ్యాటరీ ప్యాక్‌తో పరిధిని 300 కిమీకి పెంచవచ్చునని పేర్కొంది. బ్యాటరీ 8.5kW ఎలక్ట్రిక్ మోటారుతో యాడ్ చేయడం జరిగింది. ఇది11bhp పవర్, 72Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్స్..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4G కనెక్టివిటీతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కాల్స్, మ్యూజిక్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, నావిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇక ఈ స్కూటర్ గ్రేస్ వైట్, బ్లూ, బ్లాక్, రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..