అందరూ చూస్తుండగానే దారుణం.. ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ.. మాజీ వార్డు మెంబర్ హత్య..!
అనుమానం పెనుభూతమై ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

అనుమానం పెనుభూతమై ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కరణ్ కోట్ గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు సాయిలు టీవీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. టైలర్‌గా పని చేస్తున్నాడు బాలు. ఇద్దరి మధ్య మధ్య మంచి స్నేహం ఉంది. ఇదిలా ఉండగా గత ఏడాది క్రితం నుండి సాయిలు తమ కుటుంబంపై చేతబడి చేస్తున్నాడని అతడి స్నేహితుడు బాలు అనుమానం పెంచుకున్నాడు. ఏడాది క్రితం బాలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.
ఇలా ఇద్దరు మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు అయ్యాయి. తాజాగా బాలు ఇంటికి వెళ్లిన సాయిలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. అవమానంగా మాట్లాడాడు. దీంతో ఒక్కసారిగా కోపద్రికుడైన బాలు తన వెంట తెచ్చుకున్న కత్తితో అందరూ చూస్తుండగానే సాయిలు గొంతు కోసేశాడు. ఇంట్లో ఉన్న తమ భర్త వద్దకు వచ్చి బాధితుడు సాయిలు రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే హత్య చేసినట్లు భార్యకు చెప్పాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడి భార్య నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
