AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ పండుగలాంటి వార్త.. రూ. 10 లక్షల అదనపు బెనిఫిట్.!

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ తీపి కబురు అందించింది. రెండు కొత్త పథకాలు అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అటు మెట్రో ఆధీనంలోకి తీసుకునేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అసలు ఉద్యోగులకు అందబోయే బెనిఫిట్లు ఏంటి..? మెట్రో టేకోవర్‌ ప్లాన్‌ ఏంటి..?

Telangana: ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ పండుగలాంటి వార్త.. రూ. 10 లక్షల అదనపు బెనిఫిట్.!
Telangana Cabinet Meeting
Ravi Kiran
|

Updated on: Feb 24, 2026 | 7:16 AM

Share

ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు మెట్రో ఆధీనంలోకి తీసుకునేందుకు కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఉద్యోగులకు అందబోయే ఆ రూ.10 లక్షల అదనపు బెనిఫిట్ ఏంటి? మెట్రో టేకోవర్ విలువ ఎంత..?

ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 ఏళ్ల లోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్‌గా వచ్చే బెనిఫిట్లతో పాటు అదనంగా రూ.10 లక్షలు ఇచ్చేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17.7 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయ్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. 1998 రకాల వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఆసుపత్రుల్లో చికిత్స అందించనున్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం ట్రస్టుకు జమ అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఉద్యోగుల నుంచి రూ.528 కోట్లు ట్రస్టు ఖాతాలో జమ చేయనున్నారు. ఉద్యోగులతో సమానంగా ట్రస్టుకు ప్రభుత్వం సైతం జమ చేయనుంది. అంతేగాకుండా.. దీర్ఘకాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్‌కు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా, మండల కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ మెట్రో రైలును ఎల్‌ అండ్‌ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. వీరు ఎల్‌ అండ్‌ టీతో చర్చలు జరిపి, బదిలీ ప్రక్రియను వేగవంతం చేస్తారు. ఈ టేకోవర్ మొత్తం విలువ సుమారు రూ.15,000 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో మెట్రోపై ఉన్న అప్పులు రూ.13,000 కోట్లు కాగా, ఎల్ అండ్‌టీ సంస్థ ఈక్విటీ వాటా రూ.2,000 కోట్లుగా ఉంది. మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటే మొదటి దశ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

మరోవైపు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ‘తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ‘ను ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌’గా మార్చుతూ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల నిధుల కేటాయింపు, మందుల కొనుగోలు, సిబ్బందికి వేతనాల చెల్లింపు వేగవంతం అవుతాయి. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోకి కొత్తగా వికారాబాద్ జిల్లాకు చెందిన నాలుగు గ్రామాలను చేర్చారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కింద రూ.3145 కోట్లతో మరో 300 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, విద్యా సంస్థల కోసం పలు కీలక భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న 2027 జనగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

Follow Us