TG PGECET 2026: తెలంగాణ పీజీఈసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు తేదీలు ఇవే
పీజీఈసెట్ 2026 నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూ- హెచ్) ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా పరీక్షను నిర్వహించనుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న..

తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2026 నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూ- హెచ్) ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా పరీక్షను నిర్వహించనుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్‌డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..
తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత కోర్సును అనుసరించి బీఈ, బీటెక్, బీఫార్మసీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, జియో-ఇంజినీరింగ్ అండ్ జియో-ఇన్ఫర్మాటిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, ఫార్మసీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ.. విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 6, 2026వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.600 చొప్పున చెల్లించాలి. ప్రవేశ పరీక్ష మే 28 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. 120 ఆబ్జెక్టివ్ ఆధారిత ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. నెగటివ్ మార్కింగ్ ఉండదు.
ముఖ్యమైన తేదీలు..
- ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఫిబ్రవరి 27 నుంచి మే 06 వరకు
- దరఖాస్తుల సవరణకు చివరి తేదీ: మే 09 నుంచి 10 వరకు
- రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 09
- రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 12
- రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 15
- రూ.5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 18
- రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 26
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: మే 19వ తేదీ నుంచి
- పీజీఈసెట్ రాత పరీక్ష తేదీలు: మే 28 నుంచి 31 వరకు
టీజీ పీజీఈసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




