Business Ideas: ఉద్యోగం లేకపోయినా పర్లేదు.. ఈ వ్యాపారంతో నెలకు లక్ష గ్యారంటీ..!
ఉద్యోగం బదులు ఏదైనా వ్యాపారం చేయాలని చూస్తున్నారా.? రిస్క్ లేకుండా మంచి లాభాలు ఆర్జించాలనుకున్తున్నారా.? అయితే ఇది మీకోసమే.

ఉద్యోగం బదులు ఏదైనా వ్యాపారం చేయాలని చూస్తున్నారా.? రిస్క్ లేకుండా మంచి లాభాలు ఆర్జించాలనుకున్తున్నారా.? అయితే ఇది మీకోసమే. ఈ బిజినెస్ ద్వారా అధిక రాబడి పొందొచ్చు. ఎండాకాలంలో ఈ బిజినెస్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మినరల్ వాటర్ బిజినెస్‌ను వేసవి సీజన్‌లో మొదలుపెట్టండి. ఏటా 20 శాతం చొప్పున అభివృద్ధి పొందండి. ఈ మధ్యకాలంలో చాలామంది వాటర్ ప్యాకెట్స్, లీటర్ అలాగే 25 లీటర్ల వాటర్ టిన్ల బిజినెస్ పెట్టి లక్షలు సంపాదిస్తున్నారు. ఈ వ్యాపారానికి మీరు ముందుగా పాన్ నెంబర్, జీఎస్టీ నెంబర్ లాంటి ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఆ తర్వాత స్థానిక అధికార యంత్రాంగం నుంచి లైసెన్స్ తెచ్చుకోవాలి.
వాటర్ ప్లాంట్ ప్రారంభించేందుకు మీరు ఆర్ఓ ఫిల్టర్‌లతో పాటు మరికొన్ని మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే దీని కోసం 1500 చదరపు గజాల స్థలం కూడా ఉండాలి. వీటన్నింటికి సుమారు రూ. 2-2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంతేకాదు 20 లీటర్ల సామర్ధ్యం ఉన్న 100 వాటర్ క్యాన్లు కూడా కొనుగోలు చేయాలి. దీనికి మీరు బ్యాంక్ నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఒక మినరల్ వాటర్ బాటిల్ ధర రూ. 20 ఉంటుంది. మీరు రోజుకి 400 వాటర్ క్యాన్లు సప్లై చేస్తే రూ. 10 వేల వరకు వస్తాయి. అలా నెలకు రూ. రెండున్నర నుంచి 3 లక్షల వరకు సంపాదించవచ్చు. కరెంట్ బిల్లు, ఇతరత్రా వాటికి సుమారు లక్షన్నర పోయినా.. మీకు లక్ష వరకు లాభం ఉంటుంది.