- Telugu News Photo Gallery Business photos Know about Most Expensive and luxury homes of rich people in India, see photos
Most Expensive Homes: ఈ సంపన్నుల విలాసవంతమైన ఇళ్ళు రాజభవనాలకు తీసిపోవు.. ఆ ఫోటోలను ఇక్కడ చూద్దాం..
దేశంలోని అత్యంత ధనవంతుల ఇళ్లు వారి నికర విలువ ప్రకారం విలాసవంతమైనవి. ఈ రోజు మనం అలాంటి కొన్ని సంపన్నుల గృహాల చిత్రాలను చూపించనున్నాం. ఇవి ఏ ప్యాలెస్‌తోనైనా వైభవంగా పోటీపడతాయి. రాజమహల్స్ కూడా వీటి ముందు చిన్నపోతాయి.
Updated on: Apr 27, 2023 | 2:45 PM

సొంత ఇళ్లు ఇలా ఉండాలి.. అలా ఉండాలని కలలు కంటారు. అలానే ఇలాంటి కల సమాన్యుల నుంచి సంపన్నుల వరకు ఉంటుంది. ఎవరి స్థాయికి తగినట్లుగా వారు తమ ఇంటిని నిర్మించుకుంటారు. మన దేశంలోని పెద్ద వ్యాపారవేత్తలు తమ ఇంటిని రూ. 100 కోట్ల విలువైన ఇల్లు కొన్నారని మనం తరచుగా వార్తలు చదువుతూ ఉంటాం.

తన ఇల్లు చాలా గ్రాండ్ గా, అందంగా ఉండాలని అందరూ కలలు కంటారు. దీని కోసం ప్రతి వ్యక్తి తన సామర్థ్యాన్ని పెంచుకుంటారు. దేశంలోని అత్యంత సంపన్నుల ఇళ్లు వారి నికర విలువ ప్రకారం గ్రాండ్‌గా ఉండటం సహజం. ఈ రోజు మనం అలాంటి కొన్ని గృహాలు వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ఇవి ఏ ప్యాలెస్‌తోనైనా పోటీపడతాయి.

మెహ్రంగీర్: ముందుగా మెహ్రంగీర్ గురించి చెప్పుకుందాం. భారత అణు కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ భాభా ఈ ఇంట్లో ఉండేవారు. దీనిని గోద్రెజ్ కుటుంబానికి చెందిన స్మితా కృష్ణ గోద్రెజ్ 2014లో రూ.372 కోట్లకు కొనుగోలు చేశారు. దురదృష్టవశాత్తు, ఇప్పుడు ఈ భవనం శిథిలమైంది. దాని స్థానంలో ఎత్తైన భవనాన్ని నిర్మిస్తున్నారు.

లింకన్ హౌస్: ఒకప్పుడు ఇది వంకనేర్ మహారాజా ప్రతాప్‌సింహ్జీ ఝాలా నివాసంగా ఉండేవారు. ఇప్పుడు అది 2015లో రూ.750 కోట్లకు సైరస్ పూనావల్లకు కొనుగోలు చేశారు. ఒకప్పుడు ఈ భవనంలో అమెరికా కాన్సులేట్ ఉండేది.

నేషన్ హౌస్: ఈ విలాసవంతమైన భవనం మలబార్ హిల్‌లో ఉంది. దీనిని కుమార్ మంగళం బిర్లా కొనుగోలు చేశారు. 2015లో వేలంలో ఈ ఇంటికి రూ.425 కోట్లు చెల్లించి దక్కించుకున్నారు.

మహేశ్వరి మాన్షన్: ఇది ఇప్పుడు ఉక్కు దిగ్గజం సజ్జన్ జిందాల్ నివాసం. అతను 2012 సంవత్సరంలో దక్షిణ ముంబైలోని నేపియన్ సీ రోడ్‌లో ఉన్న ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. ఈ మూడంతస్తుల భవనానికి రూ.500 కోట్లు చెల్లించారు.

గులితా: ఇది ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఇల్లు. ఆమె తన భర్త ఆనంద్ పిరమల్‌తో కలిసి ఈ ఇంట్లో నివసిస్తోంది. దీన్ని 2012లో హెచ్‌యూఎల్ నుంచి రూ.452 కోట్ల వెచ్చించి అజయ్ పిరమల్ కంపెనీ కొనుగోలు చేసింది.

యాంటిలియా: యాంటిలియా లేకుండా అత్యంత ఖరీదైన ఇళ్ల ప్రస్తావన అసంపూర్తిగా ఉంటుంది. ఇది దేశంలోని అత్యంత సంపన్న కుటుంబమైన ముఖేష్ అంబానీ కుటుంబానికి నిలయం. దీని విలువ దాదాపు రూ.15 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.




