రాత్రి తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లు.. ఎందుకిలా
పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్ జిల్లాలో ఆధార్, ఓటర్ ఐడీ కార్డులను తగులబెట్టి, దోపిడీ చేసే ముసుగుల వ్యక్తుల గురించి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయంతో రాత్రుళ్లు కర్రలు, కత్తులతో గస్తీ తిరుగుతున్నారు. అయితే, ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇవి కేవలం ఉద్దేశపూర్వక వదంతులని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. స్థానిక పోలీసులు ప్రజలకు ధైర్యం చెబుతూ, రాత్రుళ్లు వారితో కలిసి కాపలా కాస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, వాస్తవాలను గుర్తించి భయపడకూడదని పోలీసులు కోరుతున్నారు.
రాత్రివేళ తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. ఎవరైనా వచ్చారని తెలుపు తెరిచి చూస్తే ముసుగులు ధరించిన వ్యక్తులు ఇళ్లలోకి చొరబడి, ముందు ఆధార్, ఓటర్ ఐడీ కార్డులను తగలబెట్టేసి.. తర్వాత ఇంట్లోని డబ్బులు, బంగారం, విలువైన వస్తువులు ఎత్తుకెళతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో జనం రాత్రివేళ ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. అయితే, వీటిని నమ్మొద్దని పోలీసులు ధైర్యం చెబుతున్నారు. ఇది పశ్చిమ్ బెంగాల్ ఝార్‌గ్రామ్ జిల్లాలోని పలు గ్రామాల పరిస్థితి. జనాలు రాత్రుళ్లు కర్రలు, కత్తులు పట్టుకుని ఊరిలో గస్తీ తిరుగున్నారు. ఈ వదంతులను నమ్మొద్దని పోలీసులు చెబుతున్నా.. వారు భయంతో వణికిపోతున్నారు. స్థానిక పోలీస్ అదికారులు వారికి ధైర్యం చెబుతూ.. రాత్రిళ్లు వారు కూడా కాపలా కాస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగానే పుకార్లు ప్రచారం చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. కానీ ఇలా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే దాని గురించి సమాచారం లేకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని, దోపిడీ జరిగిన సంఘటన తమ దృష్టికి రాలేదని పోలీస్ అధికారి అన్నారు. గతంలో బెంగాల్‌లోని బాలూరాఘాట్ బాలికల హాస్టల్‌లో రాత్రిపూట దెయ్యాల తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియా వదంతులు వైరల్ అయ్యాయి. దెయ్యాల భయంతో విద్యార్థినులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో వారి భయాన్ని పోగొట్టడానికి ఉపాధ్యాయులు ప్రయత్నించి విఫలమయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారం కొంటున్నారా.. ? మీ కొంప కొల్లేరే
CM Chandrababu Naidu: ఢిల్లీలో.. ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ
Andhrapradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ ఎగిరి గంతేసే వార్త
తాను చదివిన పాఠశాలలో ఇప్పుడు ఐఏఎస్‌గా తిరిగి అడుగుపెట్టిన మకరంద్
Jabardasth Mahidhar: నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

