AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కష్టపడి రాళ్లతో పగలగొట్టాడు.. అంతలోనే..

కష్టపడి రాళ్లతో పగలగొట్టాడు.. అంతలోనే..

Phani CH
|

Updated on: Feb 11, 2026 | 12:08 PM

Share

కాకినాడ జిల్లా తునిలో ఏటీఎం చోరీకి యత్నించిన ఓ జార్ఖండ్ దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అర్ధరాత్రి ఎస్‌బీఐ ఏటీఎంను పగలగొట్టడానికి ప్రయత్నించగా, సీసీ కెమెరాల ద్వారా విజయవాడలోని సెంట్రల్ సర్వే సిస్టమ్ సిబ్బంది గుర్తించారు. వెంటనే తుని పోలీసులకు సమాచారం అందించడంతో, వారు వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పోలీసుల సమయస్ఫూర్తితో భారీ చోరీ తప్పింది.

పాపం ఓ దొంగ రాత్రివేళ ఎంతో కష్టపడి ఏటీఎంలో చోరీకి యత్నించాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో కొందరు దొంగలు తమదైనశైలిలో చోరీలకు పాల్పడుతుంటే.. కొందరు మాత్రం ఇలా దొరికిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, పోలీసుల చాకచక్యం తోడైతే దొంగలు ఎంతటి ప్లాన్ వేసినా పటాపంచలు కావాల్సిందే అని తునిలో జరిగిన ఘటన నిరూపించింది. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని రమా థియేటర్ సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీకి ప్రయత్నించిన కేటుగాడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంతర్రాష్ట్ర దొంగల తరహాలోనే, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక నిందితుడు నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏటీఎం సెంటర్‌లోకి చొరబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న రాళ్లతో ఏటీఎం మిషన్‌ను పగలగొట్టి నగదు దోచుకోవాలని ప్రయత్నించాడు. అయితే, అతడు చేస్తున్న ఈ హడావుడి మొత్తం ఏటీఎంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతూ, నేరుగా విజయవాడలోని ఎస్బీఐ సెంట్రల్ సర్వే సిస్టమ్ కంట్రోల్ రూమ్‌కు చేరింది. స్క్రీన్లపై దొంగతనాన్ని గమనించిన విజయవాడ సిబ్బంది తక్షణమే స్థానిక బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న తుని ఎస్ఐ పాపారావు ఇతర సిబ్బంది మెరుపు వేగంతో ఏటీఎం వద్దకు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా వెంబడించి పట్టుకున్నారు. నిందితుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వాడని, ఇలాంటి దొంగతనాల కోసమే ఇక్కడికి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ చోరీని అడ్డుకున్న పోలీసులను, బ్యాంకు సిబ్బందిని పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాత్రి తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లు.. ఎందుకిలా

బంగారం కొంటున్నారా.. ? మీ కొంప కొల్లేరే

CM Chandrababu Naidu: ఢిల్లీలో.. ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ

Andhrapradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ ఎగిరి గంతేసే వార్త

తాను చదివిన పాఠశాలలో ఇప్పుడు ఐఏఎస్‌గా తిరిగి అడుగుపెట్టిన మకరంద్