AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను ఆ డైలాగ్ చెప్పగానే హీరో ఎంతో ఎంజాయ్ చేశాడు.. లేచిమరీ క్లాప్స్ కొట్టాడు..

నటుడు, రచయిత జనార్ధన్ రావు ఉరఫ్ జెన్నీ.. ఈ పేరు చెప్తే చాలా మంది గుర్తిపట్టలేకపోవచ్చు కానీ ఆయనను చూస్తే.. మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు ఆయన. చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ నవ్వులు పూయించారు జనార్ధన్ రావు. ఆయన స్క్రీన్ మీద కనిపించేది కొంత సేపే అయినా.. నవ్వులు పూయించి ప్రేక్షకులను అలరించే వారు జనార్ధన్ రావు.

నేను ఆ డైలాగ్ చెప్పగానే హీరో ఎంతో ఎంజాయ్ చేశాడు.. లేచిమరీ క్లాప్స్ కొట్టాడు..
Actor Jenny
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2026 | 12:59 PM

Share

ఈ నటుడిని గుర్తుపట్టారా.? ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు ఆయన. ఈ నటుడి పేరు జెన్నీ. ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు జెన్నీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జెన్నీ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహేష్ బాబు సహజంగానే చాలా తక్కువ మాట్లాడతారని, ఆయన స్వభావం చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటుందని జెన్నీ అన్నారు. సాధారణంగా తాను సీన్ చేసేటప్పుడు, ఆయన అప్పుడప్పుడు నవ్వుకునేవారని, కాస్త చనువు తీసుకుని సార్ బాగా చేశానా.? మీరు నవ్వుతున్నారు అని అడిగితే మళ్ళీ నవ్వుకునేవారని జెన్నీ గుర్తు చేసుకున్నారు. తర్వాత ఆయన వెంటనే క్యారవాన్‌లోకి వెళ్లిపోతారని తెలిపారు. మహేష్ బాబు తన క్లోజ్ సర్కిల్ డైరెక్టర్లతోనే ఎక్కువగా మాట్లాడతారని, అయితే ఎవరినీ దూరం పెట్టరని జెన్నీ చెప్పుకొచ్చారు.

ఇదికూడా చదవండి :ఏంటి సుధా ఈవిడ..! మరీ ఇంత హాట్‌గా ఉందేంటి గురూ.!! హీరోయిన్స్ కూడా పనికిరారు

దూకుడు చిత్రంలో ఒక సన్నివేశం గురించి మాట్లాడుతూ.. దూకుడు సినిమాలో ఓ సన్నివేశంలో ఏవండీ రెడ్డి గారు ఎలా ఉన్నారు? అని అడిగినప్పుడు, బ్రహ్మానందం తన చుట్టి తిరుగుతున్నాడని, తన పరిస్థితి బాగాలేదని వడ్డీల గురించి సింపతిగా చెప్పే డైలాగ్ ఉంది. టేక్ ఓకే అయినప్పటికీ, తాను ఇంకా మెరుగ్గా చేయగలననే నమ్మకంతో, డైరెక్టర్ ని మరో టేక్ అడిగానని.. అయితే మహేష్ బాబు బాగానే చేశారుగా అనేవారు. ఆతర్వాత నేను కొంచం పంచ్ లు యాడ్ చేసి సీన్ చేసినప్పుడు మహేష్ బాబు చాలా ఎంజాయ్ చేశారని.. చాలా బాగా ఉందని, అలాగే ఉంచమని చెప్పి సంబరపడ్డారని జెన్నీ గుర్తు చేసుకున్నారు.  అందుకే వారు  గొప్పవారయ్యారనిపిస్తుంది, వారి ప్రవర్తన, వారి నటన అద్భుతమని జెన్నీ కొనియాడారు.

ఇదికూడా చదవండి :అప్పుడు క్యూట్‌గా ఉండేది కదరా.. ఇలా మారిపోయిందేంటీ..!! బికినీ ఫొటోలతో రచ్చ చేస్తున్న మిరపకాయ్ భామ

దివంగత సూపర్ స్టార్ కృష్ణతో తన అనుభవాన్ని కూడా జెన్నీ పంచుకున్నారు. కృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన నెంబర్ వన్ హీరో చిత్రంలో, కృష్ణ గారు ఒక అడ్వర్టైజ్‌మెంట్ యాడ్ చేసే సన్నివేశానికి తాను డైరెక్టర్‌గా చేశానని జెన్నీ తెలిపారు. ఆ సన్నివేశంలో తాను డైరెక్టర్ కృష్ణా రెడ్డిని ఇమిటేట్ చేశానని, కృష్ణ గారిని మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాను సార్, నేను మీ ఫ్యాన్‌ని కదా అని అడిగానని జెన్నీ తెలిపారు. కృష్ణారెడ్డిని ఇమిటేట్ చేయగానే కృష్ణ గారు ఓహో ఇలా కూడా చేస్తారా.? అని నవ్వి చాలా ఆనందించారని జెన్నీ పంచుకున్నారు. ఆ క్షణాలను తాను నిజంగా ఎంతో ఆస్వాదించానని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే.. ఇద్దరు స్టార్ హీరోలు ఇరగదీశారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
ఇంట్లోని మూలల్లో ఈ వస్తువులు ఉంచండి!లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు
ఇంట్లోని మూలల్లో ఈ వస్తువులు ఉంచండి!లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు
కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు..
కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు..
ఒకే ఒక్క చెడ్డ అలవాటు.. ఈ మంచి నటుడి ప్రాణం తీసేసింది..
ఒకే ఒక్క చెడ్డ అలవాటు.. ఈ మంచి నటుడి ప్రాణం తీసేసింది..
టాయ్ ట్రైన్ క్రేజ్: 21 కిలోమీటర్ల ప్రయాణం కోసం రాత్రంతా క్యూలోనే
టాయ్ ట్రైన్ క్రేజ్: 21 కిలోమీటర్ల ప్రయాణం కోసం రాత్రంతా క్యూలోనే
తాతల కాలంలో నాటుకోడిని మెత్తగా ఉడకబెట్టడానికి ఇవి పాటించారా..
తాతల కాలంలో నాటుకోడిని మెత్తగా ఉడకబెట్టడానికి ఇవి పాటించారా..
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు
మామిడి టెంకలతో అద్భుతమైన అందం! చర్మం, జుట్టు సమస్యలకు దివ్యౌషధం!
మామిడి టెంకలతో అద్భుతమైన అందం! చర్మం, జుట్టు సమస్యలకు దివ్యౌషధం!
మీ కళ్లకు పరీక్ష.. ఆ 2 బేసి సంఖ్యలను 11 సెకన్లలో కనిపెట్టగలరా?
మీ కళ్లకు పరీక్ష.. ఆ 2 బేసి సంఖ్యలను 11 సెకన్లలో కనిపెట్టగలరా?