AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie Collections: బాక్సాఫీస్ వద్ద పెద్ది ప్రభంజనం.. 3 రోజుల్లోనే దిమ్మతిరిగే కలెక్షన్స్..

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సినిమా పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు అడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇందులో రామ్ చరణ్ యాక్షన్, బాడీ మేకోవర్ చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు. జూన్ 4న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మూడు రోజుల్లోనే విధ్వంసం క్రియేట్ చేసింది.

Peddi Movie Collections: బాక్సాఫీస్ వద్ద పెద్ది ప్రభంజనం.. 3 రోజుల్లోనే దిమ్మతిరిగే కలెక్షన్స్..
Peddi Movie News
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2026 | 12:18 PM

Share

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, డైరెక్టర్ దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. జూన్ 4న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా మొదటి రోజు నుంచి ఇప్పటివరకు చిత్రం కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఈ చిత్ర వసూళ్లను మేకర్స్ ఎప్పటికప్పుడు పోస్టర్స్ ద్వారా సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. తాజాగా మూడు రోజుల కలెక్షన్స్ అనౌన్స్ చేశారు. చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రదర్శిస్తున్నట్లుగా, ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 236.7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.136.36 కోట్ల భారీ గ్రాస్ అందుకుంది. అలాగే రెండవ రోజు ముగిసేసరికి ఈ మూవీ రూ.181.8 కోట్లు రాబట్టింది. ఇక తాజాగా మూడో రోజు ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.236.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. అటు బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో అన్ని కలిపి ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా 4 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ ఈ స్థాయి రికార్డులు నమోదు చేయడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

ఈ విజయంతో రామ్ చరణ్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుని ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ గా నిలిచారు. తాజా విడుదలైన ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ కండలు తిరిగిన దేహంతో, తీవ్రమైన హావభావాలతో సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్న లూక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సినిమాలోని ఆయన పాత్ర తీవ్రతను, గ్రామీణ నేపథ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.1980ల నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో, ఒక సామాన్య యువకుడు తన సమాజం కోసం, ఆత్మగౌరవం కోసం కుస్తీ (రెజ్లింగ్), క్రీడల ద్వారా ఎలా పోరాడాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

పెద్ది కలెక్షన్స్..

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!