Tollywood: స్టార్ హీరో షాకింగ్ నిర్ణయం! సినిమాలకు గుడ్ బై చెప్పనున్న ట్యాలెంటెడ్ యాక్టర్! కారణమేమిటంటే?
జయపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న ఈ హీరో ఇప్పుడు తన ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన అతను తన భవిష్యత్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

సాధారణంగా చాలామంది నటీనటులు తమ చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటారు. హీరోయిన్ల సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. ఇదే సమయంలో కొందరు నటులు మాత్రం ఉన్నట్లుండి సినిమాలకు గుడ్ చై చెప్పేస్తుంటారు. సినిమా కెరీర్ బాగా ఉన్నప్పటికీ, చేతినిండా అవకాశాలు ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతుంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని చేరేలా కనిపిస్తున్నాడు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైన ఈ నటుడు తాజాగా తన భవిష్యత్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం నూరుసామి (తెలుగులో వంద దేవుళ్లు) అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్ ఆంటోని. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 19న తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నాడు విజయ్. ఈ క్రమంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ రాబోయే రెండు మూడేళ్లలో చెన్నై వదిలేసి, పల్లెటూరిలో స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పాడు.
‘నాకు ఎప్పటి నుంచో సాధారణంగా బతకడంపైనే ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల కారణంగా చెన్నైలో ఉంటున్నాను. శ్రీధర్ వెంబు.. టెంకాశీలో స్థిరపడినట్లు నేను పొల్లాచ్చి లాంటి ప్రాంతంలో నివసించాలని అనుకుంటున్నాను. ఇప్పటికే ఏదైనా గ్రామంలో భూమి కొనేందుకు చూస్తున్నాను. రూరల్ లైఫ్ నిజంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య అనుబంధం లాంటి మంచి విషయాలు గ్రామాల్లో నే ఉన్నాయి’ అని విజయ్ ఆంటోని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా విజయ్ ఆంటోనికి మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు ఉంది. కేవలం హీరోగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా, ఎడిటర్ గానూ సత్తా చాటారాయన. ముఖ్యంగా పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు విజయ్. మహాత్మ, దరువు వంటి తెలుగు సినిమాలకు కూడా విజయ్ ఆంటోనినే స్వరాలు అందించడం విశేషం. ఇక బిచ్చగాడు సినిమాతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అతను డైరెక్టర్ గానూ ఆకట్టుకున్నాడు. అయితే విజయ్ సినిమా కెరీర్ బాగున్నప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం ఒడిదొడుకులతో సాగుతుంది. మూడేళ్ల క్రితం ఈ హీరో కూతురు ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచే సినిమాలు బాగా తగ్గించేశాడు విజయ్. ఇప్పుడు మరోసారి తన సినిమా కెరీర్ గురించి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడీ ట్యాంటెడ్ యాక్టర్.
#VijayAntony plans to shift to a village in the next 3 years for a more peaceful life.
“Chennai is where I live for cinema, but my heart belongs to village life. Personally, I feel more at home amidst nature and peaceful surroundings.
In the next 2–3 years, I plan to settle… pic.twitter.com/xau75GsQEG
— Studio Flicks (@StudioFlicks) June 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




