శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భక్తుల రద్దీని నియంత్రించలేక వాహనసేవ, గ్రామోత్సవం రద్దు కావడంతో ఉత్సవాలు ఆలయానికే పరిమితమయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని ఈ "అపచారం" అధికారుల వైఫల్యమేనని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం కనీస ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు.