AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్ యూజర్లకు శుభవార్త.. ఇక బ్రౌజర్ నుండే నేరుగా వీడియో, ఆడియో కాల్స్

వెబ్ యూజర్లకు శుభవార్త.. ఇక బ్రౌజర్ నుండే నేరుగా వీడియో, ఆడియో కాల్స్

Phani CH
|

Updated on: Feb 11, 2026 | 12:27 PM

Share

మెటా వాట్సాప్ వెబ్ సరికొత్త అప్‌డేట్‌తో బ్రౌజర్ నుండే ఆడియో, వీడియో కాల్స్ సాధ్యం. ఇకపై కంప్యూటర్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయనవసరం లేదు. స్క్రీన్ షేరింగ్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి ఫీచర్‌లతో సురక్షితంగా కాల్స్ చేసుకోండి. త్వరలో 32 మందితో గ్రూప్ కాల్స్ కూడా రానున్నాయి. ఇది లైనక్స్ యూజర్లకు, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ ఇష్టపడని వారికి గొప్ప ప్రయోజనం.

మెటా యాజమాన్యంలోని వాట్సాప్, తన వెబ్ వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మకమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇకపై కంప్యూటర్లలో ప్రత్యేకంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేయనవసరం లేకుండానే, నేరుగా బ్రౌజర్ నుండే ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రమే కాలింగ్ సౌకర్యం ఉండేది. కానీ ఫిబ్రవరి 10న వచ్చిన తాజా అప్‌డేట్‌తో గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ వంటి బ్రౌజర్ల ద్వారా నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ‘వాట్సాప్ వెబ్ బీటా’ ప్రోగ్రామ్‌లో ఉన్న ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రాబోయే కొద్ది వారాల్లో సాధారణ యూజర్లందరికీ ఇది దశలవారీగా అందుబాటులోకి రానుంది. ఇందులో.. వీడియో కాల్ సమయంలో మీ కంప్యూటర్ స్క్రీన్‌ను ఇతరులకు షేర్ చేయవచ్చు. ఇది ఆఫీస్ మీటింగ్స్, ప్రజెంటేషన్లకు ఎంతో ప్రయోజనకరం. మొబైల్ కాల్స్ లాగే ఇవి కూడా ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్’తో పూర్తి సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం వ్యక్తిగత కాల్స్ కు మాత్రమే అవకాశం ఉండగా, త్వరలోనే 32 మంది వరకు గ్రూప్ కాల్‌లో మాట్లాడుకునేలా, కాల్ లింక్స్ మరియు షెడ్యూల్డ్ కాల్స్ వంటి ఫీచర్లను జత చేయనున్నారు. ఈ కొత్త ఫీచర్ ముఖ్యంగా లైనక్స్ వినియోగదారులకు మరియు అదనపు సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేయడానికి ఇష్టపడని వారికి గొప్ప ఊరటనిస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. ఏం చేశారంటే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త

కష్టపడి రాళ్లతో పగలగొట్టాడు.. అంతలోనే..

రాత్రి తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లు.. ఎందుకిలా

బంగారం కొంటున్నారా.. ? మీ కొంప కొల్లేరే