టమాటా రైతులకు కనీస ధర లేక తీవ్ర నష్టాలు వస్తున్నాయి. ఒకప్పుడు లాభాలు తెచ్చిన టమాటా, ఇప్పుడు పెట్టుబడి ఖర్చులను కూడా రాబట్టలేకపోతోంది. కర్నూలు, ఆస్పరి, హొళగుంద మార్కెట్లలో కిలోకు ఐదు రూపాయలు మాత్రమే పలకడంతో, రైతులు నిస్సహాయంగా తమ పంటను రోడ్ల పక్కన పారబోస్తున్నారు.