- Telugu News Photo Gallery Spiritual photos Vastu shastra Vastu Tips for Puja Room to avoid Financial problems in Home Know Here Details
Vastu shastra: మీ పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే కనకవృష్టి ఖాయం.. వివరాలివే..
Puja Room Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచి జరుగుతుంది. పూజ గది ఈ దిక్కున ఉంటే ఇంట్లో శాంతి, ఐశ్వర్యం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Updated on: Apr 26, 2023 | 2:03 PM

జ్యోతిష్య శాస్త్రం మాదిరిగానే.. వాస్తు శాస్త్రం కూడా ఒక వ్యక్తి జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులకు నిర్దిష్ట హోదాలు ఉన్నాయి. వాటిని ఆయా ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలి. లేదంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా కొన్ని రకాల వస్తువులను పూజ గదిలో ఉంచాలి. అవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమే కాకుండా.. మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఇంట్లోని పూజ గదిలో ఏయే వస్తువులు ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పూజ గది స్థానం: వాస్తు శాస్త్రం ప్రకారం, పూజ గదిని ఈశాన్య దిశలో ఉంచడం మంచిది. పూజ గది ఈ దిక్కున ఉంటే ఇంట్లో శాంతి, ఐశ్వర్యం ఉంటుందని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే పూజ గదిని దక్షిణ దిశలో పెట్టకూడదు. ఆ వైపు పూజా గది ఉంటే ఆ ఇంట్లో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

సాలిగ్రామం: శివుడు లింగరూపంలో పూజింపబడినందున, విష్ణువు సాలిగ్రామంగా పూజింపబడతాడు. ఆ కారణంగా సాలిగ్రామాన్ని పూజా స్థలంగా ఉంచడం చాలా శ్రేయస్కరం. పూజా మందిరంలో సాలిగ్రామాన్ని కూడా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని విశ్వాసం.

శంఖం: ఇంట్లో రోజూ శంఖాన్ని ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువులు నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

గంగా జలం: హిందూమతంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర నది నీరు ఎప్పుడూ చెడిపోదని ప్రజలు నమ్ముతారు. ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచడానికి కారణం ఇదే. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్మకం.

నెమలి పింఛం: శ్రీకృష్ణుడికి నెమలి పింఛాలంటే చాలా ఇష్టమని తెలిసిన విషయమే. పూజ చేసే స్థలంలో నెమలి పింఛాలను ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. పూజ గదిలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి దూరం అవుతుంది.





























