America: శభాస్ చిన్నోడా.. ఏడో తరగతి పిల్లాడు.. 67 మంది ప్రాణాలు కాపాడాడు..

ఆ పిల్లోడు చదివేది ఏడో తరగతే.. జస్ట్‌ సెవెంత్‌ క్లాస్.. అయితేనేం.. తన తెలివితో ఏడుపదుల మందిని కాపాడాడు. ఇంతకీ.. ఎవరా పిల్లోడు?.. అతనేం చేశాడో.. తెలుసుకుందాం.. సాధారణంగా ప్రమాదాలు అనేవి చెప్పి రావు.. సడెన్‌గా అలా జరిగిపోతుంటాయి. కానీ..

America: శభాస్ చిన్నోడా.. ఏడో తరగతి పిల్లాడు.. 67 మంది ప్రాణాలు కాపాడాడు..
Boy
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 28, 2023 | 10:47 PM

ఆ పిల్లోడు చదివేది ఏడో తరగతే.. జస్ట్‌ సెవెంత్‌ క్లాస్.. అయితేనేం.. తన తెలివితో ఏడుపదుల మందిని కాపాడాడు. ఇంతకీ.. ఎవరా పిల్లోడు?.. అతనేం చేశాడో.. తెలుసుకుందాం.. సాధారణంగా ప్రమాదాలు అనేవి చెప్పి రావు.. సడెన్‌గా అలా జరిగిపోతుంటాయి. కానీ.. కొన్ని సందర్భాల్లో కొంచెం తెలివిగా వ్యవహరించినా.. కొన్ని ప్రాణాలను కాపాడొచ్చు. ఇదిగో.. ఇక్కడ మనం చూసే ఈ బాలుడు అదే చేశాడు. ఏడో తరగతి చదువుతున్న ఆ బాలుడు.. తన సమయస్ఫూర్తితో బస్సు డ్రైవర్‌తో సహా 66 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడాడు. అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఘటన అమెరికాలోని మిచిగాన్‌లో చోటుచేసుకుంది.

ఓ స్కూల్‌ బస్సు పిల్లల్ని తీసుకుని పట్టణంలోని వారెన్‌ కన్సాలిడేటెడ్‌ అనే పాఠశాలకు బయలుదేరింది. అందులో దాదాపు 66 మంది చిన్నారులు ఉన్నారు. బస్సు నడుపుతున్న డ్రైవర్‌.. ఎప్పటిలా.. బాగానే నడుతున్నాడు. అయితే.. సడెన్‌గా మధ్యలో ఏం జరిగిందో కానీ.. డ్రైవర్‌ ఆకస్మికంగా స్టీరింగ్‌ను వదిలి కిందికి వాలిపోయాడు. ఇంకేముంది.. రోడ్డుపై మెలికలు తిరుగుతూ భయంకరంగా వెళ్ళడం ప్రారంభించింది ఆ బస్సు. పిల్లలంతా భయంతో కేకలు వేయడం మొదలుపెట్టారు. కానీ.. ఐదో వరుసలో కూర్చున్న డిల్లాన్‌ రీవ్స్‌ అనే బాలుడు మాత్రం.. డ్రైవర్‌ పడిపోవటం గమనించి వేగంగా ముందుకు దూసుకొచ్చాడు. అత్యంత తెలివిగా వ్యవహరించి.. వెంటనే స్టీరింగ్‌ను పట్టుకుని బ్రేక్‌ వేశాడు.

అంతేకాదు.. ఓ వైపు బ్రేకుపై కాలేసి తొక్కుతూనే.. పబ్లిక్ సేఫ్టీ ఆన్సర్ పాయింట్‌కు ఫోన్‌ చేయమని మిగిలిన విద్యార్థులకు సూచించాడు. అంతే.. పెను ప్రమాదం వేళ బాలుడు అప్రమత్తంగా వ్యవహరించి తోటి విద్యార్థుల ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బాలుడు చూపిన ధైర్యానికి మెచ్చిన పలువురు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్కూల్‌ యాజమాన్యం కూడా ఆ బాలుడు తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలో అభినందనలు తెలిపింది. ఇక.. డ్రైవర్‌ మద్యం సేవించి బస్సు నడిపారా లేక అనారోగ్యంతో కిందపడిపోయారా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..