AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America President: అమెరికాలో అప్పుడే మొదలైన ఎన్నికల హడావుడి.. బైడెన్‌పై నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైంది. బైడెన్‌ గురించి రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి. ఇంతకీ.. బైడెన్‌ గురించి ఆమె చేసిన కామెంట్స్‌ ఏంటి?..

America President: అమెరికాలో అప్పుడే మొదలైన ఎన్నికల హడావుడి.. బైడెన్‌పై నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు
Nikki On Biden Death
Surya Kala
|

Updated on: Apr 29, 2023 | 6:41 AM

Share

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో ఏడాదిన్నరకుపైగా సమయం ఉంది. అయితే.. ప్రస్తుతం ప్రతిపక్షంలోనున్నరిపబ్లికన్‌ పార్టీ వినూత్న ప్రచారానికి తెరతీసింది. వచ్చే ఎన్నికల్లో బైడెన్‌ వయస్సునే ప్రచార అస్త్రంగా వాడుకోబోతున్నారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున బరిలో ఉన్న నిక్కీ హేలీ.. జో బైడెన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బెడైన్‌కు ఓటేస్తే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రెసిడెంట్ అవుతారని, ఎందుకంటే.. ఆయన ఐదేళ్లకు మించి బతకరని చెప్పుకొచ్చారు హేలీ. జో బైడెన్ వయసు ప్రస్తుతం 80 ఏళ్లు దాటింది. హేలీ వయసు 51 ఏళ్లే. అందుకే.. ఎన్నికల ప్రచారంలో వయసునే ప్రధాన అస్త్రంగా మలుచుకుని ముందుకెళ్లాలని హేలీ భావిస్తున్నారు. వృద్ధులను ఎన్నుకునే ముందు ఆలోచించాలని అమెరికన్లను కోరుతున్నారు.

ఆరోగ్యం సరిగా లేని వారు అగ్రరాజ్యాన్ని ముందుకెలా నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు నిక్కీ హేలీ. 75 ఏళ్లు దాటి ఎన్నికల్లో పోటీ చేసేవారికి మానసిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలనే కొత్త డిమాండ్‌ను నిక్కీ హేలీ తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం 80 ఏళ్లు దాటిన బైడెన్.. మరో ఐదేళ్లు ఆరోగ్యంగా ప్రాణాలతో ఉంటారనే నమ్మకం తనకులేదన్నారు హేలీ. మరోవైపు.. తాను మరోసారి డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష బరిలో ఉంటున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు బైడెన్. తాను పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశారు. శ్వేతసౌధం కూడా బైడెన్‌ కోటు ధరించి జాగింగ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. బైడెన్‌ కూడా తనకు ఎలాంటి ఆరోగ్య, మానసిక సమస్యలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా.. బైడెన్‌పై నిక్కీ హేలీ కామెంట్స్‌.. ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి మరి. మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..