Telangana New Secretariat:  రాజధాని నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఠీవీగా కొత్త సచివాలయం

Telangana New Secretariat: రాజధాని నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఠీవీగా కొత్త సచివాలయం

Anil kumar poka

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 30, 2023 | 2:33 PM

ఓవైపు హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం, మరోవైపు నిలువెత్తు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, ఇంకోవైపు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నిర్మిస్తున్న అమరజ్యోతి.. పక్కనే ఎన్టీఆర్ పార్క్, లుంబినీ పార్క్, ఆ పక్కన నెక్లెస్ రోడ్, ఐమాక్స్.. ఇలా చారిత్రక, పర్యాటక అంశాలతో ముడిపడిన ప్రదేశంలో నిర్మించిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.

ఓవైపు హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం, మరోవైపు నిలువెత్తు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, ఇంకోవైపు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నిర్మిస్తున్న అమరజ్యోతి.. పక్కనే ఎన్టీఆర్ పార్క్, లుంబినీ పార్క్, ఆ పక్కన నెక్లెస్ రోడ్, ఐమాక్స్.. ఇలా చారిత్రక, పర్యాటక అంశాలతో ముడిపడిన ప్రదేశంలో నిర్మించిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇవాళ మధ్యాహ్నం సచివాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సుదర్శన యాగం కోసం సచివాలయ ప్రాంగణంలో యాగశాల చేశారు. ఆదివారం ఉదయం నుంచి సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ తరువాత నూతన సమీకృత సచివాలయం రిబ్బన్ కటింగ్ చేసిన వెంటనే 6వ అంతస్తులోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువుదీరనున్నారు. సచివాలాయాన్ని ప్రారంభించిన వెంటనే సీఎం కేసీఆర్ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్‌ తన కుర్చీలో కూర్చున్న తర్వాత… మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లి కుర్చీల్లో కూర్చొంటారు. మంత్రులు అందరూ కూడా తమ శాఖకు సంబంధించిన ఒక దస్త్రంపై… సంతకం చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల వరకు.. అధికారులు కుర్చీల్లో కూర్చొని ఒక దస్త్రంపై సంతకాలు చేయడంతో ప్రారంభోత్సవ ఘట్టం పూర్తవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్ ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ఆహ్వానితులతో కూడిన సమావేశాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: Apr 30, 2023 08:33 AM