Kaur Singh: బాక్సింగ్‌ దిగ్గజం కౌర్ సింగ్‌ ఇకలేరు.. ముఖ్యమంత్రి సంతాపం

భారత బాక్సింగ్ దిగ్గజం కౌర్ సింగ్ (74) గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కౌర్ సింగ్ హర్యానాలోని కురుక్షేత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కౌర్ సింగ్ మృతి పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంతాపం తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో..

Kaur Singh: బాక్సింగ్‌ దిగ్గజం కౌర్ సింగ్‌ ఇకలేరు.. ముఖ్యమంత్రి సంతాపం
Legendary Indian Boxer Kaur Singh
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 28, 2023 | 11:50 AM

భారత బాక్సింగ్ దిగ్గజం కౌర్ సింగ్ (74) గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కౌర్ సింగ్ హర్యానాలోని కురుక్షేత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కౌర్ సింగ్ మృతి పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంతాపం తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆడిన కౌర్‌ దేశం పేరు నిలబెట్టారని మాన్‌ కొనియాడారు. ఆయన క్రీడా జీవితం ఔత్సహిక బాక్సర్లకు స్పూర్తినిస్తుందని మాన్‌ అన్నారు. కాగా కౌర్‌సింగ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని ఖనాల్ ఖుర్ద్‌ అనే గ్రామంలో జన్మించిన కౌర్‌ సింగ్‌ బాక్సింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించారు. దిగ్గజ ఆటగాడు మహహ్మద్‌ ఆలీతో తలపడిన ఏకైక ఇండియన్‌ బాక్సర్‌గా కౌర్‌ సింగ్‌కు చెరగని పేరుంది. ఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొన్న కౌర్‌ హెవీ వెయిట్‌ విభాగంలో తలపడి పసిడి పతకం సాధించారు. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ఆరు పసిడి పతకాలు సాధించిన ఈ వెటరన్‌ బాక్సర్‌ ఒలింపిక్స్‌లోనూ భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించారు.

ఇవి కూడా చదవండి

బాక్సింగ్‌ క్రీడలో కౌర్‌ సింగ్ సాధించిన ఘనతకు గుర్తింపుగా 1982లో అర్జున అవార్డు, 1983లో పద్మశ్రీ పురస్కారం, 1988లో విశిష్ట సేవా మెడల్ పురస్కారాలు లభించాయి. 1979లో జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా వెలుగులోకి వచ్చిన కౌర్‌.. అంతకుముందు సైన్యంలో విధులు నిర్వర్తించారు. 1971లో పాక్‌తో యుద్ధంలో పోరాడారు. కౌర్‌ మృతి పట్ల పంజాబ్‌ సీఎం భగ్‌వంత్‌ మాన్‌ సంతాపం తెలిపారు. ఈనెల ప్రారంభంలో పంజాబ్‌ పాఠశాల పాఠ్యాంశాల్లో నలుగురు దిగ్గజ అథ్లెట్ల జీవిత కథలను ప్రచురించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హాకీ ఐకాన్ బల్బీర్ సింగ్ సీనియర్, లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్, ఒలింపియన్ గుర్బచన్ సింగ్ రంధావాతోపాటు బాక్సర్ కౌర్ సింగ్ పేరు కూడా ఉంది. ఈ మేరకు ఈ నెల ప్రారంభంలో 9, 10 తరగతుల శారీరక విద్య పాఠ్యపుస్తకాలలో వారి జీవిత కథలను చేర్చనున్నట్లు పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.