BCCI: తెలుగమ్మాయిలకు జాక్‌పాట్‌.. బీసీసీఐ స్పెషల్‌ కాంట్రాక్ట్‌ లిస్టులో అంజలి, మేఘనలకు చోటు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 25 ఏళ్ల అంజలి లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌గా టీమిండియాలోకి అడుగుపెట్టింది. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిందామె. ఇప్పటివరకు 6 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆమె..

BCCI: తెలుగమ్మాయిలకు జాక్‌పాట్‌.. బీసీసీఐ స్పెషల్‌ కాంట్రాక్ట్‌ లిస్టులో అంజలి, మేఘనలకు చోటు
Anjali,meghana
Follow us

|

Updated on: Apr 28, 2023 | 10:49 AM

భారత మహిళల క్రికెట్‌ జట్టులో నిలకడగా రాణిస్తోన్న తెలుగమ్మాయిలకు బంపరాఫర్‌ దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా క్రికెటర్లు సబ్బినేని మేఘన, అంజలి శర్వాణీలకు మొదటిసారిగా బీసీసీఐ స్పెషల్‌ కాంట్రాక్ట్‌ లభించింది. తాజాగా బోర్డు ప్రకటించిన లిస్టులో మేఘన, అంజలి గ్రేడ్‌ ‘సి’ కాంట్రాక్టు లిస్టులో చోటు దక్కించుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 25 ఏళ్ల అంజలి లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌గా టీమిండియాలోకి అడుగుపెట్టింది. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిందామె. ఇప్పటివరకు 6 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆమె 3 వికెట్లు తీసింది. ఇక మహిళల ప్రీమియర్‌లోనూ యూపీ వారియర్జ్‌ తరఫున ఆడి ఆకట్టుకుంది. అలాగే స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా టీమిండియాలోకి అడుగుపెట్టిన సబ్బినేని మేఘన ఇప్పటివరకు 3 వన్డేలు, 17 టీ20లు ఆడింది. అలాగే వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించింది. మూడు గ్రేడ్‌లలో కలిపి మొత్తం 17 మందితో బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించింది. మే 2021 తర్వాత మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్‌లు ప్రకటించడం ఇదే తొలిసారి.

గ్రేడ్‌ ఎ లిస్టులో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్, స్టార్ బ్యాటర్‌ స్మృతి మంధాన ఉండగా, కొత్తగా స్టార్ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మకు చోటు దక్కింది. లభించింది. రిటైర్‌ అయిన మిథాలీరాజ్‌, జులన్‌ గోస్వామీలతో పాటు పూనమ్‌ యాదవ్‌ను ఈ జాబితా నుంచి తప్పించింది బీసీసీఐ. బి గ్రేడ్‌ జాబితాను కూడా 10 మంది నుంచి కేవలం ఐదుగురికే కుదించారు. ప్రస్తుతం బి గ్రేడ్‌లో రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్‌ మాత్రమే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ స్పెషల్ కాంట్రాక్టులు గ్రేడ్‌ల వారీగా..

గ్రేడ్ ఎ: హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ

గ్రేడ్ బి: ​​రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, రాజేశ్వరి గయక్వాడ్

గ్రేడ్ సి: మేఘనా సింగ్, దేవిక వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..