AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Schedule Update : ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై బీసీసీఐ సంచలన నిర్ణయం

IPL 2026 Schedule Update : ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది జరగనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ షెడ్యూల్ విషయంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

IPL 2026 Schedule Update : ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై బీసీసీఐ సంచలన నిర్ణయం
Ipl
Rakesh
|

Updated on: Feb 24, 2026 | 6:12 PM

Share

IPL 2026 Schedule Update : ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది జరగనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ షెడ్యూల్ విషయంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. దేశంలోని మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈసారి ఐపీఎల్ షెడ్యూల్‌ను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరిగే అవకాశం ఉండగా, ఎన్నికల తేదీలను బట్టి వేదికలను మార్చాలని బోర్డు భావిస్తోంది.

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో పోలీసు యంత్రాంగం మొత్తం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటుంది. ఇలాంటి సమయంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లేదా చెన్నైలోని చిదంబరం స్టేడియం వంటి మైదానాల్లో వేల సంఖ్యలో వచ్చే అభిమానులకు రక్షణ కల్పించడం పోలీసులకు కష్టతరమైన పని. అందుకే ఎన్నికలు లేని రాష్ట్రాల్లో ఐపీఎల్ మొదటి దశ మ్యాచులను నిర్వహించి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి రెండో దశ షెడ్యూల్ ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది.

షెడ్యూల్ ఎప్పుడు వస్తుందనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి చివరి నాటికి మొదటి దశకు సంబంధించిన 20-25 మ్యాచుల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ తేదీలను ప్రకటించిన వెంటనే, మార్చి మధ్యలో మిగిలిన మ్యాచుల వివరాలను వెల్లడిస్తారు. దీనివల్ల ఎన్నికలు జరిగే రోజుల్లో ఆయా నగరాల్లో మ్యాచులు లేకుండా జాగ్రత్త పడవచ్చు. గతంలో కూడా సార్వత్రిక ఎన్నికల సమయంలో బీసీసీఐ ఇలాంటి వ్యూహాన్నే అనుసరించిన సంగతి తెలిసిందే.

అయితే ఈసారి బీసీసీఐ ముందు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. సాధారణంగా కోల్‌కతాలో ఇబ్బందులు ఎదురైతే అస్సాంలోని గౌహతి స్టేడియాన్ని ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. కానీ ఈసారి అస్సాంలో కూడా ఎన్నికలు ఉండటంతో అది సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచకప్ మ్యాచులు జరిగిన స్టేడియాలను మళ్ళీ ఐపీఎల్ కోసం సిద్ధం చేయడానికి గ్రౌండ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్‌కు తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి బీసీసీఐ ఈ మెగా టోర్నీని ఎలా నిర్వహిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us