AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virupaksha: విరూపాక్ష మూవీ నుంచి ‘కలల్లో’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. ఇంత మంచి మెలోడీని ఎందుకు తీసేశారబ్బా!

కాగా సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకునే ఉద్దేశంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. 'కలల్లో నేను ఉలిక్కి పడుతున్నా, నిజాన్ని ఓ కొలిక్కి తేవెంటే'.. అంటూ సాగిన ఈ పాట సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.

Virupaksha: విరూపాక్ష మూవీ నుంచి 'కలల్లో' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. ఇంత మంచి మెలోడీని ఎందుకు తీసేశారబ్బా!
Virupaksha Movie
Basha Shek
|

Updated on: Apr 27, 2023 | 9:59 AM

Share

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్‌ సినిమా విరూపాక్ష. సుకుమార్‌ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ సంయుక్తామేనన్‌ హీరోయిన్‌గా నటించింది. సుకుమార్‌ స్ర్కీన్‌ ప్లేఅందించారు. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్‌ న్యాచురల్ థ్రిల్లర్‌ మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.55 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు విరూపాక్ష మూవీ మేకర్స్‌ తెలిపారు. కాగా సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకునే ఉద్దేశంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. ‘కలల్లో నేను ఉలిక్కి పడుతున్నా, నిజాన్ని ఓ కొలిక్కి తేవెంటే’.. అంటూ సాగిన ఈ పాట సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. సాంగ్‌ విజువల్స్‌ కూడా సూపర్బ్‌గా ఉన్నాయి. అలాగే సాయి ధరమ్‌ తేజ్‌, సంయుక్త జోడీ కూడా ఎంతో అందంగా కనిపించిందీ మెలోడీ సాంగ్‌లో.

అయితే ‘కలల్లో’ పాట విరూపాక్ష సినిమాలో లేదు. లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు కానీ.. ఫైనల్‌ ఎడిటింగ్‌లో తొలగించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా సాగే సినిమాలో పాటలు రావడం వల్ల మూవీ టెంపో దెబ్బతినే అవకాశముందని మేకర్స్‌ ఈ మెలొడీ సాంగ్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఫుల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేసినట్లు అర్థమవుతోంది. అయితే ఈ పాటను సినిమాలో పెట్టి ఉంటే బాగుండేదని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు కాంతారా ఫేమ్‌ అజనీశ్‌ లోక్‌ నాథ్‌ స్వరాలు సమకూర్చారు. ఇక కలల్లో పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, అనురాగ్‌ కులకర్ణి, మధుశ్రీ ఆలపించారు.

కలల్లో ఫుల్ వీడియో సాంగ్

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..