Dasara OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నాని వంద కోట్ల సినిమా.. ‘దసరా’ను ఎక్కడ చూడొచ్చంటే?

మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలు దసరా సినిమాను మెచ్చుకున్నారు. పాన్‌ ఇండియా లెవెల్లో వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dasara OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నాని వంద కోట్ల సినిమా.. 'దసరా'ను ఎక్కడ చూడొచ్చంటే?
Dasara Ott
Follow us
Basha Shek

|

Updated on: Apr 26, 2023 | 6:35 PM

న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో వచ్చిన చిత్రం దసరా. మహానటి కీర్తి సురేశ్‌ వెన్నెల పాత్రలో నటించి మెప్పించింది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నాని కెరీర్‌లోనే మైల్డ్‌స్టోన్‌ మూవీగా నిలిచింది. మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలు దసరా సినిమాను మెచ్చుకున్నారు. పాన్‌ ఇండియా లెవెల్లో వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. దసరా సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తి కావడంతో మరికొన్నిగంటల్లో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది దసరా మూవీ. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి నాని  సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ దసరా సినిమా అందుబాటులో ఉండనుంది. దసరా సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్‌ శెట్టి కీలక పాత్రలో కనిపించాడు. అలాగే సముద్రఖని, సాయికుమార్‌, షైన్‌ టామ్‌చాకో తదితరులు కీ రోల్స్‌ పోషించారు. విలేజ్‌ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించాడు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చాడు. ఇక ఈ మూవీలోని డిలిటెడ్ సీన్స్ కూడా యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?