AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో ఉన్న ట్యాలెంటెడ్‌ హీరో అండ్‌ డైరెక్టర్‌ ఎవరో తెలుసా? స్టార్‌ హీరోలతో సినిమాలు తీశాడండోయ్‌..

తెలుగులో ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబులతో సినిమాలు తీసి హిట్లు కొట్టాడు. ఆ తర్వాత హీరోగానూ అదరగొట్టాడు. ఆపై విలన్‌గానూ మెప్పించాడు. ఇలా మల్టీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్నాడు.

ఈ ఫొటోలో ఉన్న ట్యాలెంటెడ్‌ హీరో అండ్‌ డైరెక్టర్‌ ఎవరో తెలుసా? స్టార్‌ హీరోలతో సినిమాలు తీశాడండోయ్‌..
Tollywood Hero
Basha Shek
|

Updated on: Apr 25, 2023 | 8:55 PM

Share

గతంలో మెగా ఫొన్‌ పట్టి డైరెక్షన్‌ చేసిన ఎంతోమంది హీరోలుగా, నటులుగా మారిపోతున్నారు. యాక్టర్‌గా తమలోని కొత్త ట్యాలెంట్‌ను పరిచయం చేస్తున్నారు. ఫై ఫొటోలో ఉన్న ఆయన కూడా ఈ కోవకు చెందిన వాడే. గతంలో ఆయన స్టార్‌ హీరోలతో సినిమాలు చేశారు. తెలుగులో ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబులతో సినిమాలు తీసి హిట్లు కొట్టాడు. ఆ తర్వాత హీరోగానూ అదరగొట్టాడు. ఆపై విలన్‌గానూ మెప్పించాడు. ఇలా మల్టీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్నాడు. తాజాగా ఆయన కీలక పాత్ర పోషిస్తున్న ఓ సినిమా నుంచి ఆయన లుక్‌ను రివీల్‌ చేశారు మేకర్స్‌ .ఇందులో గుబురు గడ్డం, చేతిలో గన్‌ పట్టుకుని ఎంతో స్టైలిష్‌గా కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఇంతకీ ఆయనెవరో గుర్తుపట్టారా? కనిపెట్టకపోతే నో ప్రాబ్లం.. ఆన్సర్‌ మేమే చెబుతాం. ఆయన మరెవరో కాదు.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో ఖుషి వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు, నటుడు ఎస్‌.జే. సూర్య. కోలీవుడ్ స్టార్‌ విశాల్‌ హీరోగా తెరకెక్కుతోన్న మార్క్‌ ఆంటోని మూవీలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తాజాగా మార్క్ ఆంటోని మూవీ నుంచి ఎస్‌.జె.సూర్య లుక్‌ను రివీల్‌ చేశారు మేకర్స్‌. ఇందులో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు సూర్య. ఈ ఫొటోను హఠాత్తుగా చూస్తే సూర్యనే అని త్వరగా గుర్తుపట్టలేరు. తీక్షణగా చూస్తే మాత్రం గుర్తుపట్టవచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారందరూ ఎస్ జె సూర్య గుర్తుపట్టలేకుండా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మార్క్ ఆంటోనీ మూవీ లో ఎస్ జె సూర్య తో పాటు, దర్శకుడు సెల్వ రాఘవన్, సునీల్ వర్మ , అభినయ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మినీ స్టూడీయోస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై ఎస్. వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని త‌మిళంతో పాటు, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో తెరకెక్కుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..