Mohammed Siraj: 14 ఓవర్లలో 57 డాట్‌ బాల్స్.. పవర్‌ ప్లేలో పంజా విసురుతోన్న హైదరాబాదీ పేసర్‌.. రికార్డులు బద్దలు

టీమిండియా పేసర్‌, హైదరాబాదీ ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా బ్యాటర్లు సులభంగా షాట్లు కొట్టే పవర్‌ ప్లేలోనే తన తడాఖా చూపిస్తున్నాడు. ఇప్పటివరకు పవర్‌ ప్లేలో 14 ఓవర్లు వేసిన సిరాజ్‌ 57 డాట్‌ బాల్స్ నమోదు చేయడం విశేషం. అలాగే 6 వికెట్లు నేలకూల్చాడు. ఎకానమీ రేటు జస్ట్‌ 4.21 మాత్రమే.

Mohammed Siraj: 14 ఓవర్లలో 57 డాట్‌ బాల్స్.. పవర్‌ ప్లేలో పంజా విసురుతోన్న హైదరాబాదీ పేసర్‌.. రికార్డులు బద్దలు
Mohammed Siraj
Follow us
Basha Shek

|

Updated on: Apr 21, 2023 | 7:15 AM

టీమిండియా పేసర్‌, హైదరాబాదీ ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా బ్యాటర్లు సులభంగా షాట్లు కొట్టే పవర్‌ ప్లేలోనే తన తడాఖా చూపిస్తున్నాడు. ఇప్పటివరకు పవర్‌ ప్లేలో 14 ఓవర్లు వేసిన సిరాజ్‌ 57 డాట్‌ బాల్స్‌ నమోదు చేయడం విశేషం. అలాగే 6 వికెట్లు నేలకూల్చాడు. ఎకానమీ రేటు జస్ట్‌ 4.21 మాత్రమే. ఇక ఈ సీజన్‌లో ఓవరాల్‌గా 6 మ్యాచులు ఆడిన హైదరాబాదీ పేసర్‌ మొత్తం 12 వికెట్లు పడగొట్టాడు. దీంతో పర్పుల్‌ క్యాప్‌ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే ఫెర్ఫామెన్స్‌ తో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం అందుకున్నాడు సిరాజ్‌. మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన అతను 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ధనాధన్‌ లీగ్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్లో ఒక సూపర్‌ త్రోతో పంజాబ్‌ బ్యాటర్‌ను రనౌట్‌ చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసీస్(84), విరాట్ కోహ్లీ(59) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ సిరాజ్‌ ధాటికి 18.2 ఓవర్లలో 150 పరుగులకు అలౌటైంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(46), జితేష్ శర్మ(41) మాత్రమే రాణించారు మిగిలినవారు జస్ట్ అలా ఇలా వెళ్లారు. సిరాజ్ కు తోడుగా హసరంగా 2 వికెట్లు,  పార్నెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..