Ram Charan: పుట్టబోయే బిడ్డ కోసం రామ్‌ చరణ్‌ సంచలన నిర్ణయం!! భార్య ఉపాసనకు తోడుగా ఉండేందుకు..

పుట్టబోయే బిడ్డ కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉపాసన దంపతులు. ఉపాసన డెలివరీ కోసం విదేశాల నుంచి డాక్టర్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రసవం సమయంలో ఉపాసన తోడుగా ఉండేందుకు మెగా పవర్‌ స్టార్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఇందుకోసం సుమారు 3 నెలల పాటు..

Ram Charan: పుట్టబోయే బిడ్డ కోసం రామ్‌ చరణ్‌ సంచలన నిర్ణయం!! భార్య ఉపాసనకు తోడుగా ఉండేందుకు..
Ram Charan, Upasana
Follow us
Basha Shek

|

Updated on: Apr 20, 2023 | 11:21 AM

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌ లిస్టులో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌- ఉపాసన జోడీ ఒకటి. 2012లో పెళ్లిపీటలెక్కిన ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తమ ప్రేమానుబంధంతో నేటి యువతకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతుంటారీ లవ్లీ కపుల్‌. ఇదిలా ఉంటే పెళ్లైన సుమారు 11 ఏళ్ల తర్వాత అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందనున్నారు రామ్‌ చరణ్‌- ఉపాసన. వారసుడు/ వారసురాలి కోసం అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పుట్టబోయే బిడ్డ కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉపాసన దంపతులు. ఉపాసన డెలివరీ కోసం విదేశాల నుంచి డాక్టర్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రసవం సమయంలో ఉపాసన తోడుగా ఉండేందుకు మెగా పవర్‌ స్టార్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఇందుకోసం సుమారు 3 నెలల పాటు షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చే యోచనలో ఉన్నాడట చెర్రీ. ప్రస్తుతం రామ్‌చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. షూట్‌ దాదాపు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వారం చివర్లో లేదా వచ్చ వారంలోగా చెర్రీ షెడ్యూల్‌ కూడా పూర్తి కానుందట. దీని తర్వాత ఉపాసన వెంట ఉండేందుకు సుమారు 3 నెలల వరకు రామ్‌చరణ్‌ షూటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగ చెర్రీ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసన, పుట్టబోయే బిడ్డ కోసం రామ్‌ చరణ్‌ మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్‌ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్‌, ఎస్‌.జె. సూర్య, జయరాం, సముద్ర ఖని, నవీన్‌ చంద్ర, నాసర్‌, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?