Sai Dharam Tej: తనను కాపాడిన వ్యక్తికి సాయి ధరమ్ తేజ్ చేసిన సాయం ఇదే…
సినిమాల్లోకి రాకముందు కూడా తాను ఒకసారి యాక్సిడెంట్‌కు గురయ్యానని అప్పడు.. ఇటీవల జరిగిన యాక్సిడెంట్ అప్పుడు కూడా హెల్మెట్ తనను కాపాడిందని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. తనను కాపాడిన వ్యక్తికి డబ్బలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని అనుకోలేదని వెల్లడించాడు.
సాయ ధరమ్ తేజ్.. గత ఏడాది పెను ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. సరిగ్గా సెప్టెంబరు 10న దుర్గంచెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలు అవ్వడంతో చాలా రోజులు ఆస్పత్రిలో అపస్మారక స్థితిలోనే ఉన్నాడు తేజ్. అప్పట్లో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున పూజలు కూడా చేశారు. డాక్టర్ల కృషి.. ఫ్యాన్స్ పూజలు, పెద్దల ఆశీస్సులు, దేవుడి కటాక్షంతో.. కొన్ని రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి వచ్చాడు తేజ్. ఒక రకంగా చెప్పాలంటే హెల్మెట్ అతడి ప్రాణాలను నిలిపింది. అయితే ప్రమాదం ఎఫెక్ట్ మాత్రం తేజ్‌పై చాలా రోజుల పాటు ఉంది. మాటలు మాట్లేందుకు కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు ఆల్ సెట్. మళ్లీ సినిమాలు మొదలెట్టేశాడు. విరూపాక్షతో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న తేజ్ యాక్సిడెంట్ జరిగిన రోజు తనను కాపాడిన వ్యక్తి గురించి కొన్ని వివరాలు పంచుకున్నారు.
యాక్సిడెంట్ జరిగిన రోజు సాయి ధరమ్ తేజ్‌ను ఐడెంటిఫై చేసి.. అతడిని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లేలా చేసిన వ్యక్తి పేరు సయ్యద్ అబ్ధుల్. కోలుకున్నాక అతడిని కలిసినట్లు సాయి తేజ్ చెప్పాడు. కొంత డబ్బు ఇచ్చి.. ప్రాణం నిలిపిన అతడికి థ్యాంక్స్ చెప్పి పంపలేనని.. అందుకే నంబర్ ఇచ్చి.. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా సంకోచించకుండా కాల్ చేయమని చెప్పినట్లు తేజ్ వివరించాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు పరంగా అతడికి ఏమైనా సాయం చేశారో లేదో తనకు తెలియదని తెలిపాడు. తన మానవత్వానికి డబ్బుతో ముడి కట్టలేనని.. అతడికి సాయం కావాలంటే మాత్రం ఎక్కడివరకు అయినా వెళ్తానని తేజ్ వెల్లడించాడు.
ఇదే సమయంలో తాను అసలు మద్యం సేవించనని సాయి తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ఆ రోజున తాను డైరెక్టర్ దేవా కట్టా ఇంటికి వెళ్తున్నట్లు తెలిపాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..