Thaman: ‘తమన్‌ సార్‌.. మీరు గ్రేట్‌’.. క్యాన్సర్‌ బారిన పడిన మ్యూజీషియన్‌ ఫ్యామిలీకి 10 లక్షల సాయం చేసిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

ఇప్పటివరకు సినిమాల పరంగానే తమన్‌ పేరు వినిపించింది. ఇటీవల సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లోనూ ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పేరు మార్మోగిపోయింది. అయితే ఇప్పుడు తమన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి సినిమాల విషయంలో కాదు.. ఎప్పుడూ సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండే తమన్‌ ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు

Thaman: 'తమన్‌ సార్‌.. మీరు గ్రేట్‌'.. క్యాన్సర్‌ బారిన పడిన మ్యూజీషియన్‌ ఫ్యామిలీకి 10 లక్షల సాయం చేసిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌
Ss Thaman
Follow us
Basha Shek

|

Updated on: Apr 19, 2023 | 10:14 AM

తమన్‌.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతోన్న స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. సినిమాల మీద సినిమాల చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంటారాయన. అదే సమయంలో ఆహా ఇండియన్‌ ఐడల్‌ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ అప్‌కమింగ్‌ సింగర్స్‌కు విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కాగా ఇప్పటివరకు సినిమాల పరంగానే తమన్‌ పేరు వినిపించింది. ఇటీవల సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లోనూ ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పేరు మార్మోగిపోయింది. అయితే ఇప్పుడు తమన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి సినిమాల విషయంలో కాదు.. ఎప్పుడూ సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండే తమన్‌ ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు. అదేంటంటే.. ఇటీవల తన టీమ్‌లోని మ్యూజిషియన్ ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారట. క్యాన్సర్‌ బారిన పడిన ఆయన కోలుకునేందుకు తప్పనిసరిగా కీమో థెరపీ చేయాల్సివచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న తమన్‌ ఆ మ్యూజిషియన్‌కు ఏకంగా రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించారట. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతోన్న ఇండియన్‌ ఐడల్‌ తెలుగు షోలో స్టార్‌ సింగర్‌ గీతా మాధురి ఈ విషయాన్ని బయటపెట్టారు. క్యాన్సర్ వచ్చిన వ్యక్తిని కీమో చేస్తున్న క్రమంలో శరీరం మొత్తం కాలిపోయిందట. దీంతో అతనిని డిశ్చార్జి చేయండంటే.. డబ్బులు ఇస్తే గానీ ఆసుపత్రి నుండి పంపేది లేదన్నారట. దీంతో తమన్‌ ఆ మొత్తాన్ని ఇచ్చారని గీత తెలిపింది. అలా ఆ రోజు కుటుంబంలో తమన్‌ దేవుడయ్యాడని స్టార్‌ సింగర్‌ చెప్పుకొచ్చింది.

అన్నట్లు గుంటూరులోనూ ఓ పెద్ద అనాథాశ్రమం కడుతున్నాడట తమన్‌. త్వరలోనే పనులు పూర్తి చేసి దీనిని ప్రారంభిస్తానని చెప్పుకొచ్చాడీ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ‘మనిషి అన్నాక ఏదైనా మంచి చేయాలి. సినిమాలు, టీవీ షోల ద్వారా నేను సంపాదించిన డబ్బును ఛారిటీకి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడదే చేస్తున్నాను’ అని అంటున్నాడు తమన్‌. మొత్తానికి తన దానగుణంతో అందరి మన్ననలు అందుకుంటున్నాడు తమన్‌. ఇక సినిమాల విషయానికొస్తే.. వీరసింహారెడ్డితో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాతో పాటు మహేశ్‌ బాబు ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాకు, అలాగే పవన్ కల్యాణ్ ఓజీ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?