సముద్రపు ఒడ్డున సేద తీరుతున్న ఈ సినీ తారను గుర్తుపట్టారా? మల్టీ ట్యాలెంటెడ్‌ వుమన్‌గా తెలుగు నాట బాగా ఫేమస్‌..

పై ఫొటోలో సముద్రపు ఒడ్డున సేద తీరున్నది ఓ ప్రముఖ నటి. పేరుకు మరాఠీనే అయినా తెలుగులోనే ఈమె బాగా ఫేమస్‌. తెలుగులో నటించింది కేవలం రెండు సినిమాల్లో అయినా క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం నటిగానే కాదు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, ఎడిటర్‌గా, నిర్మాతగా, డైరెక్టర్‌గా సత్తాచాటింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో

సముద్రపు ఒడ్డున సేద తీరుతున్న ఈ సినీ తారను గుర్తుపట్టారా? మల్టీ ట్యాలెంటెడ్‌ వుమన్‌గా తెలుగు నాట బాగా ఫేమస్‌..
Actress
Follow us
Basha Shek

|

Updated on: Apr 18, 2023 | 12:28 PM

పై ఫొటోలో సముద్రపు ఒడ్డున సేద తీరున్నది ఓ ప్రముఖ నటి. పేరుకు మరాఠీనే అయినా తెలుగులోనే ఈమె బాగా ఫేమస్‌. తెలుగులో నటించింది కేవలం రెండు సినిమాల్లో అయినా క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం నటిగానే కాదు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, ఎడిటర్‌గా, నిర్మాతగా, డైరెక్టర్‌గా సత్తాచాటింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్‌ వుమన్‌గా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో టాలీవుడ్‌లో ఒక స్టార్‌ హీరోతో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకుంది. తమ దాంపత్య బంధానికి గుర్తింపుగా ఇద్దరి పిల్లలకు అమ్మయ్యింది. అయితే ఏమైందో తెలియదు కానీ భార్యాభర్తలూ విడిపోయారు. ఇలా దాంపత్య జీవితంలో అలజడులు రేగినా కుంగిపోలేదామె. ఆత్మవిశ్వాసంతో అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అదే సమయంలో సినిమాల్లో సెకెండ్‌ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతోంది. మాస్‌ మహరాజా రవితేజ సినిమాతో త్వరలో మన ముందుకు వస్తోన్న ఈ అందాల తారెవరో గుర్తుపట్టారా? గుర్తుపట్టకపోయినా నో ప్రాబ్లమ్‌.. మేమే చెబుతాం లెండీ. ఇందులో ఉన్నది మరెవరో కాదు ప్రముఖ టాలీవుడ్‌ నటి రేణూ దేశాయ్‌.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ నిత్యం తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ విషయాలను అందులో షేర్‌ చేస్తుంటుంది. అలాగే తన పిల్లల ఫొటోలను కూడా పంచుకుంటుంది. అలా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది రేణూ దేశాయ్‌. అందులో ఆమె కూతురు ఆద్యను కూడా చూడొచ్చు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన రేణు దేశాయ్‌ .. సముద్రపు నీళ్లలో అలా తడుస్తూ ఉంటే.. కొట్టుకుపోతూ ఉంటే.. తన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఇలా వీడియోలు, ఫోటోలు తీస్తు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. అయితే ఒక్కరూ కూడా తనను పైకి లాగడం లేదంది. ‘ కొన్ని సందర్భాలుంటాయి.. మనకు ఏడ్వాలో నవ్వాలో అర్థం కావు.. ఇది కూడా అలాంటి ఓ సందర్భమే’ అని ఈ సందర్భంగా కోట్‌ చేసింది రేణు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?