Singer Mano: 15 భాషలు.. 25వేలకు పైగా పాటలు.. 38 ఏళ్ల ప్రస్థానం.. సింగర్‌ మనో సేవలకు అరుదైన గౌరవం

సంగీత ప్రపంచంలో మనో అందించిన సేవలకు గుర్తింపుగా సింగర్ మనోకు అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాతన రిచ్‌మండ్‌ గ్యాబ్రియేల్‌ విశ్వ విద్యాలయం మనోకు డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

Singer Mano: 15 భాషలు.. 25వేలకు పైగా పాటలు.. 38 ఏళ్ల ప్రస్థానం.. సింగర్‌ మనో సేవలకు అరుదైన గౌరవం
Singer Mano
Follow us

|

Updated on: Apr 17, 2023 | 12:13 PM

సింగర్‌.. మ్యూజిక్‌ ఆర్టిస్ట్‌.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌.. నటుడు.. ఇలా టాలీవుడ్‌లో మల్టీ ట్యాలెంటెడ్‌ పర్సన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మనో. 38 ఏళ్ల సినీ ప్రస్థానంలో వేలాది పాటలకు తన గొంతుతో ప్రాణం పోశారాయన. ఇక రజనీకాంత్‌, మల్‌హాసన్‌, రఘువరన్‌, అక్షయ్‌కుమార్‌, అనుపమ్‌ఖేర్‌ తదితరులకు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా తన గంభీరమైన గొంతును అరువుగా ఇచ్చారు. నటుడిగానూ కొన్ని సినిమాల్లో ఆకట్టుకున్నారు. అలాగే పలు సింగింగ్‌ ట్యాలెంట్‌షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈక్రమంలో సంగీత ప్రపంచంలో మనో అందించిన సేవలకు గుర్తింపుగా సింగర్ మనోకు అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాతన రిచ్‌మండ్‌ గ్యాబ్రియేల్‌ విశ్వ విద్యాలయం మనోకు డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. డాక్టరేట్‌ పట్టా పట్టుకుని దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ..

‘భారతీయ సంగీత పరిశ్రమలో.. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా 38 సంవత్సరాల్లో 15 భాషల్లో 25 వేలకుపైగా పాటలను అందించినందుకు రిచ్‌మండ్ గాబ్రియేల్ విశ్వవిద్యాలయం నాకు డాక్టరేట్‌ అందించింది. నన్ను సపోర్ట్‌ చేసే వారందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలానే ఉండాలి’ అని తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నారు మనో. దీంతో అభిమానులు, నెటిజన్లు సింగర్‌ మనోకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం టీవీల్లో ప్రసారమవుతోన్న సింగింగ్‌ అండ్‌ మ్యూజిక్‌షోలక న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు మనో. అప్‌ కమింగ్‌ సింగర్స్‌కు విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..