Meter OTT: అప్పుడే ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం సినిమా!! మీటర్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

భారీ అంచనాలతో ఏప్రిల్‌ 7 న థియేటర్లలో విడుదలైన  మీటర్ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. రివేంజ్ డ్రామాతో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కమర్షియల్‌ మూవీస్ చూసేవారిని ఓ మోస్తరు ఆకట్టుకుంది. అలాగే పోలీస్‌గా కిరణ్‌ అబ్బవరం యాక్టింగ్‌, అతుల్య రవి అందచందాలు కాస్త

Meter OTT: అప్పుడే ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం సినిమా!! మీటర్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Meter Ott
Follow us
Basha Shek

|

Updated on: Apr 16, 2023 | 9:14 AM

వినరో భాగ్యము విష్ణుకథ వంటి హిట్‌ తర్వాత యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన సినిమా మీటర్. పోలీస్‌ కాప్‌ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అతుల్య రవి హీరోయిన్‌గా నటించింది. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై చిరంజీవి, హేమలత నిర్మించిన ఈ సినిమాకు రమేశ్‌ కండూరి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌మ‌ర్పకులుగా వ్యవహరించారు.భారీ అంచనాలతో ఏప్రిల్‌ 7 న థియేటర్లలో విడుదలైన  మీటర్ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. రివేంజ్ డ్రామాతో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కమర్షియల్‌ మూవీస్ చూసేవారిని ఓ మోస్తరు ఆకట్టుకుంది. అలాగే పోలీస్‌గా కిరణ్‌ అబ్బవరం యాక్టింగ్‌, అతుల్య రవి అందచందాలు కాస్త రిలీఫ్‌ ఇస్తాయి. ఇలా థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకున్న మీటర్‌ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుందని తెలుస్తుంది.

మీటర్‌ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే మీట‌ర్ డిజిట‌ల్ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. మే మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. త్వ‌ర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాలో ధనుష్‌ పవన్‌, సప్తగిరి, పోసాని కృష్ణ మురళి, వినయ్‌ వర్మ, కేశవ్‌ దీపక్‌ తదితరులు నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!