AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి తర్వాత మొదటిసారి మనోజ్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేసిన మౌనిక.. స్టైలిష్‌ లుక్‌లో మెరిసిన లవ్లీ కపుల్‌

చు మనోజ్‌ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. తన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ విషయాలను ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటాడు. ఇదే సమయంలో మనోజ్‌తో పోలీస్తే సోషల్‌ మీడియాలో మౌనిక సందడి తక్కువే.

పెళ్లి తర్వాత మొదటిసారి మనోజ్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేసిన మౌనిక.. స్టైలిష్‌ లుక్‌లో మెరిసిన లవ్లీ కపుల్‌
Manchu Manoj Mounika
Basha Shek
|

Updated on: Apr 15, 2023 | 1:29 PM

Share

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ ఇటీవలే రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాకు చెందిన దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికా రెడ్డి మెడలో ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. గత నెలలో ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో మనోజ్‌- మౌనికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి జరిగిన కొద్ది రోజుల తర్వాత మళ్లీ సినిమా షూటింగులో బిజీ అయిపోయాడు మంచు మనోజ్‌. అలాగే సతీమణి మౌనికతో కలిసి ఓ టాక్‌ షోకి కూడావెళ్లాడు. అందులో తమ 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ, ఆ తర్వాత పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే తమ పర్సనల్‌ లైఫ్‌లో తాము ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలను అందరితో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ టాక్‌ షోకు సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. కాగా మంచు మనోజ్‌ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. తన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ విషయాలను ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటాడు. ఇదే సమయంలో మనోజ్‌తో పోలీస్తే సోషల్‌ మీడియాలో మౌనిక సందడి తక్కువే.

ఇప్పటివరకు తన పెళ్లిఫొటోలను కూడా నెట్టింట్లో షేర్‌ చేసుకోలేదు మౌనిక. అయితే తాజాగా మంచు మనోజ్‌తో కలిసి దిగిన ఓ బ్యూటిఫుల్‌ పిక్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది మౌనిక. ఇందులో సెలబ్రిటీ స్టైలిస్ట్‌ సబ్యసాచి చీరను ధరించి ఎంతో అందంగా కనిపించింది మౌనిక. ఇక ఎప్పటిలాగే సింపుల్‌ లుక్‌లో ఆకట్టుకన్నాడు మనోజ్‌. ‘ మీ ప్రేమాభిమానాలు, దీవెనలకు కృతజ్ఞతలు’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది మౌనిక. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘బ్యూటిఫుల్‌ కపుల్‌, లవ్లీ జోడీ, మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి