AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీలోకి వచ్చిన పాన్ ఇండియా మూవీస్.. దాస్ కా ధమ్కీ, కబ్జా సినిమాలను ఎందులో చూడొచ్చంటే?

విశ్వక్‌ సేన్‌ నటించిన దాస్‌ కా ధమ్కీ, అలాగే కన్నడ సూపర్ స్టార్‌ ఉపేంద్ర నటించిన కబ్జా. ఈ రెండు పాన్‌ ఇండియా సినిమాలే. భారీ వ్యయంతో తెరకెక్కి థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమాల ఓటీటీ రిలీజ్‌ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూశాడు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ఈ రెండు మూవీస్‌ ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి.

OTT Movies: ఓటీటీలోకి వచ్చిన పాన్ ఇండియా మూవీస్.. దాస్ కా ధమ్కీ, కబ్జా సినిమాలను ఎందులో చూడొచ్చంటే?
Ott Movies
Basha Shek
|

Updated on: Apr 14, 2023 | 11:11 AM

Share

ఎప్పటిలాగే ఈ వీకెండ్‌ కూడా ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు అడుగుపెట్టాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన మూవీస్‌ విశ్వక్‌ సేన్‌ నటించిన దాస్‌ కా ధమ్కీ, అలాగే కన్నడ సూపర్ స్టార్‌ ఉపేంద్ర నటించిన కబ్జా. ఈ రెండు పాన్‌ ఇండియా సినిమాలే. భారీ వ్యయంతో తెరకెక్కి థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమాల ఓటీటీ రిలీజ్‌ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూశాడు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ఈ రెండు మూవీస్‌ ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ మార్చి 22న థియేటర్లలో విడుదలైంది. విశ్వక్ డ్యూయల్ రోల్‌లో కనిపించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ కథానాయికగా నటించింది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇక కన్నడ సూపర్‌ స్టార్స్‌ ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌, శివరాజ్‌కుమార్‌ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన సినిమా కబ్జా. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో శ్రియా శరణ్‌ హీరోయిన్‌ గా నటించింది. ఆర్‌.చంద్రు దర్శకత్వం వహించారు. అయితే మొదటి నుంచి కేజీఎఫ్‌ సినిమాతో పోల్చడంతో కబ్జా అంచనాలను అందుకోలేకపోయింది. మార్చి 17న రిలీజైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కేజీఎఫ్‌ ఆలోచనలను పక్కన పెట్టి ఫ్రెష్ ఫీల్‌తో కబ్జాను చూస్తే బాగా ఎంజాయ్ చేయవచ్చని రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ రెండు మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్లను థియేటర్లలో మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీల్లో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?