Isha Chawla: సినిమాలకు దూరంగా ‘ప్రేమకావాలి’ హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

సినిమా కథల ఎంపికలో పొరపాట్లు చేసింది ఇషా. బాలకృష్ణతో చేసిన 'శ్రీమన్నారాయణ', సునీల్‌తో చేసిన 'మిస్టర్‌ పెళ్లి కొడుకు' బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్స్‌గా మిగిలిపోయాయి. అల్లరి నరేశ్‌తో కలిసి నటించిన జంప్‌ జిలానీ కూడా యావరేజ్‌ రిజల్ట్‌తోనే సరిపెట్టుకుంది.

Isha Chawla: సినిమాలకు దూరంగా 'ప్రేమకావాలి' హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Isha Chawla
Follow us
Basha Shek

|

Updated on: Apr 13, 2023 | 11:40 AM

సాయికుమార్‌ తనయుడు ఆది సాయికుమార్‌ హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన చిత్రం ప్రేమకావాలి. 2011లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రంతోనే తెలుగు తెరకు ఇంట్రడ్యూస్‌ అయ్యింది ఢిల్లీ బ్యూటీ ఇషా చావ్లా. ఇందులో హీరో ఆదితో ఈ ముద్దుగుమ్మ చేసిన అల్లరి అందరికీ గుర్తుంటుంది. ఆ సినిమాలో ఇషా అందానికి, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో వెంటనే సునీల్‌ పూల రంగడు సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. ఇది కూడా సూపర్‌హిట్‌గా నిలవడంతో టాలీవుడ్‌ లక్కీ మస్కట్‌గా మారిపోయింది ఇషా. అయితే ఆ తర్వాతే సినిమా కథల ఎంపికలో పొరపాట్లు చేసింది ఇషా. బాలకృష్ణతో చేసిన ‘శ్రీమన్నారాయణ’, సునీల్‌తో చేసిన ‘మిస్టర్‌ పెళ్లి కొడుకు’ బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్స్‌గా మిగిలిపోయాయి. అల్లరి నరేశ్‌తో కలిసి నటించిన జంప్‌ జిలానీ కూడా యావరేజ్‌ రిజల్ట్‌తోనే సరిపెట్టుకుంది. తెలుగులో అవకాశాలు కరువవ్వడంతో కన్నడ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. స్టార్‌ హీరో దర్శన్‌తో కలిసి విరాట్ అనే సినిమాలో నటించింది. దీనికి కూడా మిక్స్‌డ్‌ టాక్‌ రావడంతో ఇషా ఆశలు గల్లంతయ్యాయి.

కాగా 2016లో విడుదలైన విరాట్‌ తర్వాత సినిమాల నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది ఇషా చావ్లా. గత ఏడేళ్లుగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆ మధ్యన త్రిష, నికిషా పటేల్‌ హీరోయిన్లుగా ఎం.ఎస్‌.రాజు తలపెట్టిన ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో ఇషాకు కూడా ఛాన్స్ వచ్చింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అలాగే క‌మ‌ల్ కామ‌రాజుతో కలిసి అగోచర సినిమాలోనూ నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా ఊసే లేదు. గతేడాది ఇషా లీడ్‌ రోల్‌లో బాలీవుడ్‌లో ఓ వెబ్‌సిరీస్‌ ప్లాన్‌ చేశారు ఓ డైరెక్టర్‌. అయితే అది కూడా ఇషాను నిలబెట్టలేకపోయింది. ఇలా సినిమాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది ఇషా చావ్లా. తన లేటెస్ట్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకుంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. అయితే గతేడాది డిసెంబర్‌ తర్వాత ఆమె ఇన్‌స్టా నుంచి ఒక్క పోస్ట్‌ కూడా షేర్‌ కాలేదు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Esha Chawla (@eshachawla63)

View this post on Instagram

A post shared by Esha Chawla (@eshachawla63)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!