IPL 2023: రింకూ సింగ్‌ 5 సిక్సర్ల విధ్వంసం.. మెతుకు ముట్టని యశ్‌ దయాల్‌ తల్లి.. కొడుకును అలా చూడలేక..

రింకూ సింగ్‌ విధ్వంసం చూడలేక ఏం చేయాలో తోచలేక మైదానంలోనే కూలబడిపోయాడు యశ్‌ దయాల్. అయితే ఇవన్నీ క్రికెట్‌లో సర్వసాధారణమేనంటూ చాలామంది యశ్‌కు సపోర్టుగా నిలిచారు. గతంలో స్టువర్ట్‌ బ్రాడ్, బెన్‌ స్టోక్స్ లాంటి స్టార్‌ క్రికెటర్లు కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నవారేనంటూ గుజరాత్‌ బౌలర్‌కు మద్దుతుగా నిలిచారు.

IPL 2023: రింకూ సింగ్‌ 5 సిక్సర్ల విధ్వంసం.. మెతుకు ముట్టని యశ్‌ దయాల్‌ తల్లి.. కొడుకును అలా చూడలేక..
Yash Dayal
Follow us
Basha Shek

|

Updated on: Apr 12, 2023 | 1:23 PM

గుజరాత్‌ ఫాస్ట్‌ బౌలర్‌ యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో వరుసగా 5 సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు కేకేఆర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌. విజయానికి 5 బంతుల్లో 29 పరుగులు అవసరమైన దశలో చెలరేగిన రింకూసింగ్‌ ఏకంగా 5 సిక్సర్లతో కేకేఆర్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. రింకూ సింగ్‌ విధ్వంసం చూడలేక ఏం చేయాలో తోచలేక మైదానంలోనే కూలబడిపోయాడు యశ్‌ దయాల్. అయితే ఇవన్నీ క్రికెట్‌లో సర్వసాధారణమేనంటూ చాలామంది యశ్‌కు సపోర్టుగా నిలిచారు. గతంలో స్టువర్ట్‌ బ్రాడ్, బెన్‌ స్టోక్స్ లాంటి స్టార్‌ క్రికెటర్లు కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నవారేనంటూ గుజరాత్‌ టైటాన్స్ బౌలర్‌కు మద్దుతుగా నిలిచారు. ఇక ఈ మ్యాచ్‌ జరిగి మూడు రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత మరో రెండు మ్యాచ్‌లు కూడా ఎంతో హోరాహొరీగా సాగాయి. రింకూసింగ్‌- యశ్‌ దయాల్‌ల ఉదంతాన్ని దాదాపుగా అందరూ మర్చిపోయారు. ఒక్క యశ్‌ దయాల్‌ తల్లి తప్ప. అవును దయాల్‌ తల్లి రాధా దయాల్‌ ఇప్పటికీ ఆ సంఘటననే తల్చుకుంటూ కన్నీరుమున్నీరవుతోందట. కుమారుడిని అలా చూడలేక కనీసం మెతుకు కూడా ముట్టట్లేదట. కుటుంబ సభ్యులందరూ ఆమెను ఎంత ఓదార్చాలని ప్రయత్నించినా అలాగే ఏడుస్తూ ఉన్నారట. తన కుమారుడి కెరీర్‌ ఆరంభంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడాన్ని రాధా దయాల్‌ అసలు జీర్ణించుకోలేకపోతుందంటూ యశ్‌ దయాల్‌ తండ్రి చంద్రపాల్‌ దయాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక కుమారుడికి జరిగిన చేదు అనుభవాన్ని తాను కూడా మర్చిపోలేనంటున్నాడు చంద్రపాల్‌ యాదవ్‌. ‘అదో కాల రాత్రి. మా జీవితంలో ఎప్పటికీ దాన్ని మరవలేం. క్రికెట్‌లో ఇలాంటివి సర్వసాధారణమే అయినప్పటికీ మనదాకా వస్తే కానీ ఆ బాధ అర్థం కాదు. ప్రస్తుతం నా కుమారుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. పాండ్యా (గుజరాత్ కెప్టెన్‌), జట్టు సహచరులు నా కుమారుడికి అండగా ఉండి అతనిలో ధైర్యం నింపుతోంది. ఈ విషయాన్ని మర్చిపోయేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్ సింగింగ్‌ , డ్యాన్స్‌ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసింది. ఇందుకు గుజరాత్‌ టీమ్ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా’ అని తెలిపాడు చంద్రపాల్‌ యాదవ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..