Balagam Venu: మా మనోభావాలు దెబ్బతిన్నాయి.. బలగం డైరెక్టర్ వేణుపై చర్యలు తీసుకోండి.. అసలేం జరిగిందంటే?
మార్చి 3న చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. థియేటర్లలోవిడుదలై నెలరోజులైనా, ఓటీటీలోకి వచ్చేసినా బలగం సినిమా దూకుడు ఆగడం లేదు. తెలంగాణలోని చాలా పల్లెల్లో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేసుకుని మరీ బలగం సినిమాను వీక్షిస్తున్నారంటే..
తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను సిల్వర్ స్ర్కీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం బలగం. జబర్దస్త్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. మార్చి 3న చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. థియేటర్లలోవిడుదలై నెలరోజులైనా, ఓటీటీలోకి వచ్చేసినా బలగం సినిమా దూకుడు ఆగడం లేదు. తెలంగాణలోని చాలా పల్లెల్లో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేసుకుని మరీ బలగం సినిమాను వీక్షిస్తున్నారంటే ఈ సినిమా ఎంతలా జనాల్లోకి వెళ్లిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ వేణు, ఇతర తారాగణంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలా చాలామంది బలగం వేణును మెచ్చుకుంటుంటే.. కొందరు మాత్రం అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బలగం సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కించపరిచే విధంగా తీసిన సన్నివేశాలు చాలా బాధించాయని తహసీల్దార్ మహేశ్వరను కలిసి వినతిపత్రం అందజేశారు.
బలగం సినిమాలో ఎంపీటీసీలను కించపరిచేలా ఉన్న సీన్లను వెంటనే తొలగించాలన్నారు. అలాగే దర్శకుడు వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు డిమాండ్ చేశారు.ఈ మేరకు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో తహసీ ల్దార్ మహేశ్వరను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ.. ‘బలగం సినిమా తెలంగాణ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్న తరుణంలో ఇలా ఎంపీటీసీలుగా ప్రజాప్రతినిధులమైన మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడిన సన్నివేశాలను తమను ఎంతోగాను బాధించాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..