AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: 30 కేజీల లెహెంగాతో ఇబ్బంది పడ్డా.. శరీరంపై దద్దుర్లు.. శాకుంతలం గురించి సామ్‌ ఇంకా ఏమన్నదంటే?

యశోద లాంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత సమంత నటించిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన ఆభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. అలాగే ప్రకాష్ రాజ్‌, మోహన్ బాబు, అల్లు అర్హ, సచిన్‌ ఖేడ్కర్‌..

Samantha: 30 కేజీల లెహెంగాతో ఇబ్బంది పడ్డా.. శరీరంపై దద్దుర్లు.. శాకుంతలం గురించి సామ్‌ ఇంకా ఏమన్నదంటే?
Actress Samantha
Basha Shek
|

Updated on: Apr 11, 2023 | 9:37 PM

Share

యశోద లాంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత సమంత నటించిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన ఆభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. అలాగే ప్రకాష్ రాజ్‌, మోహన్ బాబు, అల్లు అర్హ, సచిన్‌ ఖేడ్కర్‌, అనన్య నాగళ్ల, కబీర్‌ బేడీ, వర్షిణీ, హరీశ్‌ ఉత్తమన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తిచేసుకున్న ఈ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఏప్రిల్‌ 14న గ్రాండ్‌ రిలీజ్‌ ఉండడంతో సినిమా ప్రమోషన్లను వేగవంతం చేశారు మేకర్స్‌. ఇక సమంత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ శాకుంతలం సినిమా జనాల్లోకి వెళ్లేలా చేస్తుంది. అలాగే శాకుంతలం సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్‌ పెట్టింది సామ్‌. ఇందులో శాకుంతలం మూవీకి సంబంధించి ఐదు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘పూలు అంటే నాకు ఎలర్జీ. అయితే ఈ సినిమా కోసం చేతికి, మెడకి పూలు చుట్టుకోవడంతో దద్దుర్లు వచ్చాయి. అవీ ట్యాటూలాగా కనిపించాయని.. ఆరు నెలలు అవి అలాగే ఉండిపోయాయి. అయితే షూటింగ్‌ సమయంలో అవి కనిపించకుండా మేకప్‌తో కవర్‌ చేశాను’ అని చెప్పుకొచ్చింది సామ్‌.

శాకుంతలంలో తన పాత్రకు సమంత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుందట. ఇది చాలా కష్టంగా అనిపించిదని.. నిద్రలో కూడా డైలాగ్స్ కలలోకి వచ్చేవని తెలిపింది. అంతే కాకుండా సినిమా షూటింగ్‌ సమయంలో కుందేలు కరిచిందట. సెట్‌లో చాలా కుందేళ్లు ఉండగా.. ఒకటి మాత్రం తనని కరిచిందని .. ఆ కుందేలు తనకు నచ్చలేదని.. అసలు అది క్యూట్‌గానే లేదని పేర్కొంది సామ్‌ (నవ్వుతూ). ఇక శాకుంతలం సినిమాలో కనిపించే జుట్టు తనది కాదని.. అది ఒరిజినల్‌ కాదని సమంత అసలు విషయం తెలిపింది. శాకుంతం మూవీలోని ఓ పాటకు ధరించిన లెహెంగా బరువు 30 కేజీలు ఉందని సమంత తెలిపింది. దీంతోతో చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. రౌండ్‌ తిరిగినప్పుడు ఆ లెహెంగా బరువుకు ఫ్రేమ్‌ నుంచి పక్కకు వెళ్లడంతో.. కెమెరా మ్యాన్‌ గట్టిగా అరిచారని వెల్లడించింది. ‘నేను వెళ్లడం లేదు.. లెహంగానే నన్ను లాక్కుని వెళ్తోంది’ అని చెప్పడంతో సెట్‌లోని వారంతా నవ్వారని సినిమా షూటింగ్‌ అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంది సామ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!