Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అఘోరా రూపంలో భయపెడుతోన్న ఉన్న ఈ టాలీవుడ్ నటుడిని గుర్తుపట్టారా? విలన్‌ పాత్రల్లో అదరగొట్టాడండోయ్‌

గ్రహణం నీడ పట్టి విడిచేలోపు.. ఊరు మొత్తం అంతమైపోతుంది. జరగబోయే మారణ హోమాన్ని ఆపలేం. ఈ రుద్ర వణాన్ని కాపాడగల విరూపాక్షం నువ్వే' అంటూ భీకరమైన గొంతుతో డైలాగులు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు. సడెన్‌గా చూస్తే అఘోరా పాత్రలో నటించిన వారెవరో గుర్తించడం కష్టం.

Tollywood: అఘోరా రూపంలో భయపెడుతోన్న ఉన్న ఈ టాలీవుడ్ నటుడిని గుర్తుపట్టారా? విలన్‌ పాత్రల్లో అదరగొట్టాడండోయ్‌
Actor
Follow us
Basha Shek

|

Updated on: Apr 11, 2023 | 8:35 PM

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌, లేటెస్ట్‌ సెన్సేషన్‌ సంయుక్తా మేనన్‌ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్‌ నటించిన మొట్టమొదటి సినిమా ఇది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు కార్తీక్‌ దండు మొదటిసారి మెగా ఫొన్‌ పట్టి సూపర్‌ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి డైరెక్టర్ సుకుమార్‌ కలిసి సంయుక్తంగా విరూపాక్ష సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా ఈ మూవీ విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 11)న విరూపాక్ష ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఒక ఊరిని బ్లాక్ మ్యాజిక్ నుంచి కాపాడే కుర్రాడిగా కనిపించనున్నాడు తేజ్. అలాగే సాయి ధరమ్‌, సంయుక్త మేనన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

కాగా ఈ ట్రైలర్‌లో ఒక విషయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అదే అఘోరా క్యారెక్టర్‌. ‘గ్రహణం నీడ పట్టి విడిచేలోపు.. ఊరు మొత్తం అంతమైపోతుంది. జరగబోయే మారణ హోమాన్ని ఆపలేం. ఈ రుద్ర వణాన్ని కాపాడగల విరూపాక్షం నువ్వే’ అంటూ భీకరమైన గొంతుతో డైలాగులు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు. సడెన్‌గా చూస్తే అఘోరా పాత్రలో నటించిన వారెవరో గుర్తించడం కష్టం. అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తే అతను మనందరికీ తెలిసిన నటుడేనని తెలిసిపోతుంది. ఇంతకీ విరూపాక్ష సినిమాలో అఘోరాగా నటించిందెవరో తెలుసా.. గతంలో విలన్‌ పాత్రలతో అదరగొట్టి ఇప్పుడు సపోర్టివ్ రోల్స్‌లో రాణిస్తోన్న అజయ్‌. కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించి మెప్పించిన అతను తొలిసారిగా ఇలా అఘోరా పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొత్తానికి అతని గెటప్‌, డైలాగులు ట్రైలర్‌ను మరింత రక్తికట్టించాయి. గతంలో మగధీర సినిమాలో రావు రమేశ్‌లా అఘోరా క్యారెక్టర్‌ను అద్భుతంగా చేశాడనిపిస్తోంది.

Actor Ajay

Actor Ajay

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.