- Telugu News Photo Gallery Cinema photos Ram Charan and his wife Upasana's pet dog Rhyme looking cute photos viral on National Pet Day
Ram Charan: నేషనల్ పెట్ డే.. నెట్టింట వైరలవుతోన్న రామ్ చరణ్, ఉపాసన, రైమ్‌ల క్యూట్ ఫొటోస్
ఇవాళ ఏప్రిల్ 11 సందర్భంగా జంతు ప్రేమికులు జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం జరుపుకుంటున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే... పెంపుడు జంతువులను బాగా ఇష్టపడే హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందువరుసలో ఉంటారు.
Updated on: Apr 11, 2023 | 7:07 PM

ఇవాళ ఏప్రిల్ 11 సందర్భంగా జంతు ప్రేమికులు జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం జరుపుకుంటున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే... పెంపుడు జంతువులను బాగా ఇష్టపడే హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందువరుసలో ఉంటారు.

రామ్ చరణ్ సతీమణి ఉపసానకు కూడా మూగజీవులంటే ఎంతో మక్కువ. అందుకే తమ పెట్ డాగ్ రైమ్‌ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇది పూడుల్ జాతికి చెందిన శునకం. ఒంటి నిండా పట్టులాంటి బొచ్చుతో ఎంతో ముద్దొస్తుంది.

రైమ్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఒళ్లోనే పెరిగింది. రామ్ చరణ్ విదేశాలకు షూటింగ్ లకు వెళ్లే సమయంలో చార్టర్డ్ విమానంలో ఇది కూడా ఉండాల్సిందే.

సినిమా షూటింగులు లేకపోతే రైమ్‌తోనే ఎక్కువ కాలక్షేపం చేస్తాడు చెర్రీ. అన్నట్టు... రైమ్ కు ఇన్ స్టాగ్రామ్ లో సొంత అకౌంట్ కూడా ఉందండోయ్. ఆ అకౌంట్ ను 58 వేల మంది ఫాలో అవుతున్నారంటే రైమ్ ఎంత పాపులరో అర్థమవుతుంది.

ఇవాళ జంతు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన, రైమ్‌ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.