AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khushbu: అప్పుడే 32 ఏళ్లు.. మీ కోసం నా గుండె ఎప్పటికీ కొట్టుకుంటూనే ఉంటుంది.. ఖుష్బూ ఎమోషనల్‌

తెలుగు, హిందీ, తమిళ్‌ భాషల్లో సుమారు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఖుష్బూ ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తోంది. అలాగే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఖుష్బూ.

Khushbu: అప్పుడే 32 ఏళ్లు.. మీ కోసం నా గుండె ఎప్పటికీ కొట్టుకుంటూనే ఉంటుంది.. ఖుష్బూ ఎమోషనల్‌
Khushbu
Basha Shek
|

Updated on: Apr 12, 2023 | 12:45 PM

Share

ఖుష్బూ.. ఈ పేరు అప్పట్లో సంచలనం. 90వ దశకంలో తన అందం, అభినయంతో స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ తెచ్చుకుందామె. వెంకటేశ్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్, ప్రభు, కార్తీక్‌ వంటి స్టార్‌ హీరోలతో కలిసి నటించిందామె. తెలుగు, హిందీ, తమిళ్‌ భాషల్లో సుమారు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఖుష్బూ ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తోంది. అలాగే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఖుష్బూ. అంతకుముందు కొన్ని సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. చిన్నతంబి సినిమాలో ప్రభు హీరో కాగా , ఖుష్బూ హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమాను వెంకటేశ్‌ హీరోగా చంటిగా రీమేక్‌ చేశారు. ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది.

కాగా చిన్నతంబి సినిమా విడుదలై నేటి (1991 ఏప్రిల్‌ 12న)తో 32 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది ఖుష్బూ. ‘చిన్నతంబి సినిమా చేసి అప్పుడే 32 ఏళ్లు అయిందంటే అసలు నమ్మలేకపోతున్నా. నాపై కురిపించిన ప్రేమకు ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటా. వాసు, ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. మనసులను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా సర్‌కు.. అలాగే కె.బాలుకి ఎప్పటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నందిని (సినిమాలో ఖుష్బూ పేరు) ప్రతి ఒక్కరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చారు ఖుష్బూ. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..