Janhvi Kapoor: సౌత్‌లో జాన్వీ డిమాండ్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న NTR30 సినిమాలో జాన్వీ నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభంకాగా... సెకండ్ షెడ్యూల్ లో జాన్వీ సెట్ లో అడుగుపెట్టినున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం జాన్వీ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఏకంగా రూ. 3.5 కోట్లు తారక్ మూవీ కోసం తీసుకుంటుందట.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించిన జాన్వీ.. ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న NTR30 సినిమాలో జాన్వీ నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభంకాగా… సెకండ్ షెడ్యూల్ లో జాన్వీ సెట్ లో అడుగుపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం జాన్వీ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఏకంగా రూ. 3.5 కోట్లు తారక్ మూవీ కోసం తీసుకుంటుందట. ఇక అంత మొత్తంలో ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అయ్యారని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో మూవీ కావడంతో అంత పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమానే కాకుండా తెలుగు చిత్రపరిశ్రమలో జాన్వీకి మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. రెండో సినిమా ఛాన్స్ ఏకంగా మెగా పవర్ స్టార్ సరసన కొట్టేసినట్లుగా సమాచారం. డైరెక్టర్ బుచ్చిబాబు సన.. రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న చిత్రంలో జాన్వీ కథానాయికగా ఎంపికైందట. ఈ నేపథ్యంలో జాన్వీతో ఈ సినిమాకు సంప్రదింపులు జరుపుతున్నారట మేకర్స్. కానీ ఈ సినిమా కోసం ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేస్తుందట. పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే సినిమా కావడంతో ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నారు.
ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుతో చేయబోయే ప్రాజెక్ట్ స్టార్ట్ కానుందట. ఈ ఏడాది అఖరుకు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.