Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ లుక్ లీక్.. నెట్టింటిని షేక్ చేస్తోన్న పవర్ ఫుల్ పిక్..

ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమా షూటింగ్ అంటూ బిజీగా ఉంటున్నారు పవర్ స్టార్. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించబోయే ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి.

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ లుక్ లీక్.. నెట్టింటిని షేక్ చేస్తోన్న పవర్ ఫుల్ పిక్..
Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 09, 2023 | 4:12 PM

పవర్ స్టార్ సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. కనీసం పవన్ సినిమా అప్డేట్స్ వస్తే చాలు అన్న రేంజ్‏లో ఆయనకు అభిమానులు ఉంటారు. భీమ్లానాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఆలస్యంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమా షూటింగ్ అంటూ బిజీగా ఉంటున్నారు పవర్ స్టార్. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించబోయే ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇక కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ లుక్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి పవర్ స్టార్ లుక్ నెట్టింట లీకైంది. అందులో భీమ్లా నాయక్ చిత్రం తరహా లుక్ ని అప్డేట్ చేసిన వెర్షన్ లో లుంగీతో.. లైట్ గా గడ్డంతో కనిపిస్తున్నారు పవన్. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోపాటు.. డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి ధరమ్ తేజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.