Raviteja: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన మరో స్టార్ హీరో.. హిందీ సినిమాలో మాస్ మాహరాజా రవితేజ ?..

బీటౌన్ హీరోలతో కలిసి మరింత వినోదాన్ని పంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మాస్త్రం సినిమాతో అక్కినేని నాగార్జున నార్త్ అడియన్స్ ముందుకు రాగా.. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాతో వెంకటేష్ సందడి చేయబోతున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం అదితి పాత్రలో కనిపించనున్నారు.

Raviteja: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన మరో స్టార్ హీరో.. హిందీ సినిమాలో మాస్ మాహరాజా రవితేజ ?..
Raviteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2023 | 2:31 PM

ప్రస్తుతం సౌత్ మూవీస్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తికేయ 2 సినిమాలు ఇటు దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాది ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ చూపు సౌత్ పై పడింది. ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలు తెలుగులో సినిమాలు చేసి సక్సెస్ కాగా.. మరికొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక స్టార్ హీరోస్ సైతం తెలుగు తెరపై అలరించేందుకు రెడీ అవ్వగా.. ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ మాత్రం బాలీవుడ్ బాట పడుతున్నారు. బీటౌన్ హీరోలతో కలిసి మరింత వినోదాన్ని పంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మాస్త్రం సినిమాతో అక్కినేని నాగార్జున నార్త్ అడియన్స్ ముందుకు రాగా.. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాతో వెంకటేష్ సందడి చేయబోతున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం అదితి పాత్రలో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు వార్ 2 చిత్రంతో ఎన్టీఆర్ సైతం ఆ బాటలో పయనించనున్నట్లు ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‏తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి హీరో రవితేజ కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ హీరో రానా.. కరణ్ జోహార్, ఏసియన్ సునీల్ దీన్ని సంయుక్తంగా నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా.. ఇటీవల ఘోస్ట్ సినిమాను రూపొందించిన ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెరకెక్కించనున్నారట. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని టాక్ నడుస్తోంది. తాజాగా రవితేజ నటించిన రావణాసుర చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ అందుకుంటోంది.

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!