AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్టార్ హీరోలకు పోటీగా రెమ్యూనరేషన్ తీసుకుంది.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

మెగాస్టార్ చిరంజీవి.. అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణతోపాటు.. మహేష్ బాబు సరసన సైతం స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ జోడిగా మాత్రం 2019లో నటించి తన కల నెరవేర్చుకుంది. ఇక తమిళంలో కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య వంటి హీరోలతోనూ నటించింది.

Tollywood: స్టార్ హీరోలకు పోటీగా రెమ్యూనరేషన్ తీసుకుంది.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..
Actress
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2023 | 8:58 AM

Share

1990 నుంచి 2004 వరకు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్. అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళంతోపాటు.. హిందీలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి.. అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణతోపాటు.. మహేష్ బాబు సరసన సైతం స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ జోడిగా మాత్రం 2019లో నటించి తన కల నెరవేర్చుకుంది. ఇక తమిళంలో కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య వంటి హీరోలతోనూ నటించింది. కానీ పెళ్లి తర్వాత సినీరంగానికి దూరమైన ఆమె.. రీఎంట్రీ తర్వాత హిట్ చిత్రాల్లో నటించింది. ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి. ఎవరో గుర్తుపట్టరా ?.. తను అలనాటి హీరోయిన్ సిమ్రాన్.

ఏప్రిల్ 4న సిమ్రాన్ పుట్టినరోజు. నిన్న ఆమె 45వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి ఫోటో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. పంజాబీ కుటుంబంలో జన్మించిన సిమ్రాన్.. సనమ్ హర్జై అనే సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ తొలి సినిమా పరాజయం కావడంతో.. ఆమె సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మొదటగా దర్శకుడు శరత్.. తన చిత్రం అబ్బాయి గారి పెళ్లి సినిమాతో పరిచయం చేశాడు.తెలుగులో మా నాన్నకు పెళ్లి, సమరసింహారెడ్డి, ఆటో డ్రైవర్, అన్నయ్య, డాడీ, కలిసుందాం రా, మృగరాజు, డాడీ, జోడీ, వాలి, నరసింహనాయుడు, అమృత వంటి హిట్ చిత్రాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

1999 నుంచి 2004 వరకు టాప్ హీరోయిన్‏గా కొనసాగింది సిమ్రాన్. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో సిమ్రాన్ ఒకరు. అలాగే ఆమె గొప్ప డ్యాన్సర్ కూడా. భరతనాట్యం, సల్సా నృత్యాలలో కూడా ప్రావీణ్యం ఉంది. 2003 డిసెంబర్2న పైలట్ దీపక్ బగ్గాను వివాహం చేసుకున్నారు సిమ్రాన్. వీరికి ఓ బాబు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.