Tollywood: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అప్పట్లో కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. 30 ఏళ్లు సినీరంగంలో తిరుగులేని హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి..
ముఖ్యంగా ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈరోజు ఆ హీరోయిన్ పుట్టినరోజు. 1962 ఏప్రిల్ 3న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఆమె. తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్, కన్నడ చిత్రపరిశ్రమలో అనేక సినిమాల్లో నటించారు. గుర్తుపట్టండి ఆమె ఎవరో. హీరోయిన్‌గానే కాదు.. సహయనటిగానూ రాణించారు. గుర్తుపట్టండి.
ఒకప్పుడు సినీ ప్రియుల ఆరాధ్య దేవత. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. దాదాపు 30 ఏళ్ల కెరీర్ లో వివిధ భాషల్లో అనేక సినిమాల్లో నటించిన ఆమె.. తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సీనియర్ హీరో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈరోజు ఆ హీరోయిన్ పుట్టినరోజు. 1962 ఏప్రిల్ 3న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఆమె. తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్, కన్నడ చిత్రపరిశ్రమలో అనేక సినిమాల్లో నటించారు. గుర్తుపట్టండి ఆమె ఎవరో. హీరోయిన్‌గానే కాదు.. సహయనటిగానూ రాణించారు. గుర్తుపట్టండి.
ఆ అందమైన అమ్మాయి మరెవరో కాదు.. సీనియర్ నటి జయప్రద. ఆమె తండ్రి కృష్ణారావు తెలుగు సినిమా ఫైనాన్షియర్. దీంతో ఆమె చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. జయప్రద తన చిన్నతనంలో డాక్టర్ కావాలనుకుందట. కానీ ఆమెకు.. నృత్యం, సంగీతంలో శిక్షణ ఇప్పించారు ఆమె తల్లి. 7 ఏళ్ల వయస్సు నుంచి నృత్యం, పాటలలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది.
14 ఏళ్ల వయసులో పాఠశాలలో నాట్య ప్రదర్శన చేస్తుండగా.. సినీ నటుడు ఎం. ప్రభాకరరెడ్డి ఆమెకు జయప్రద అని నామకరణం చేసి .. 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివిగల ఓ పాట ద్వారా ఆమెను చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. అలా మొదలైన ఆమె సినీ ప్రస్థానం 2005 వరకు దాదాపు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో 300కు పైగా సినిమాలు చేసింది.
సీతా కళ్యాణం, అంతులేని కథ, సిరిసిరి మువవ్వు, అడవి రాముడు, యమగోల, కృష్ణ గారడీ, శ్రీవారి ముచ్చట్లు, అగ్నిపూలు, స్వయంవరం, కృష్ణార్జునులు, దేవత, సాగర సంగమం, తాండ్రా పాపారాయుడు… ఇలా ఒక్కటేమిటీ ఎన్నో చిత్రాలలో నటించారు. ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే ఒకప్పుడు ఆమె అందాన్ని ప్రశంసించారు. జయప్రద 1986లో సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.